అన్వేషించండి

SSC JE Final Result: ఎస్‌ఎస్‌సీ జేఈ తుది ఫలితాలు విడుదల, 1374 మందికి ఉద్యోగాలు

SSC JE Result: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జనవరి 5న విడుదల చేసింది.

SSC JE Final Results: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) జనవరి 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఫలితాల్లో మొత్తం 1374 మంది అభ్యర్థులు ప్రాథమికంగా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్-639, ఓబీసీ-298, ఎస్సీ-210, ఎస్టీ-98, ఈడబ్ల్యూఎస్-129 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు. ఎంపికైన వారికి సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది. 

జూనియర్ ఇంజినీర్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..

కటాఫ్ మార్కులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొదట 1324 పోస్టులకు నోటిఫికేషన్ జారీకాగా.. తర్వాత 50 పోస్టులను జతచేసింది. దీంతో పోస్టుల సంఖ్య 1374కి చేరింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులు భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పేపర్‌-1 పరీక్షలు అక్టోబర్‌ 9 నుంచి 11వ తేదీల్లో; పేపర్‌-2 పరీక్ష డిసెంబర్‌ 4న నిర్వహించారు. పేపర్‌-1, పేపర్‌-2 రాతపరీక్షల్లో అర్హత సాధించినవారికి డిసెంబరు 20 నుంచి 25 వరకు ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా తుది ఎంపిక ఫలితాలను విడుదల చేసింది. 

❂ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2023

ఖాళీల సంఖ్య: 1374

విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్

విభాగాలవారీగా పోస్టులు:

విభాగం  పోస్టులు పోస్టుల సంఖ్య
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) 486
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్) 545
సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్) 211
డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్‌మెంట్ & గంగా రెజువెనేషన్ జూనియర్ ఇంజినీర్ (సివిల్) 50
ఫరక్కా బ్యారేజీ ప్రాజెక్ట్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) 21
మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఈఎస్) జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) 47
నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్  జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) 06
మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ & వాటర్‌వేస్ (అండమాన్ లక్షద్వీప్ హార్బర్ వర్క్స్) జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) 08

పరీక్ష విధానం ఇలా..

✦ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తారు.

✦ మొత్తం 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. 'పేపర్-1'‌కు 200 మార్కులు, 'పేపర్-2'కు 300 మార్కులు ఉంటాయి.

✦ పేపర్-1లో మొత్తం 200 మార్కులకుగాను 200 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్‌ ఇంటెలిజన్స్‌ & రీజనింగ్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంజినీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/ మెకానికల్) నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు అడుగుతారు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 2 గంటలు (ప్రత్యేక అవసరాలుగలవారికి 2 గంటల 40 నిమిషాలు). పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 1/3వ వంతు  మార్కులు కోత విధిస్తారు. పేప‌ర్-1లో అర్హత‌ సాధించిన‌వారికి పేప‌ర్-2 ప‌రీక్ష నిర్వహిస్తారు.

✦ ఇక పేపర్-2 విషయానికొస్తే.. మొత్తం 300 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

జేఈ పోస్టుల నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Embed widget