అన్వేషించండి

SSC Constable Results: కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు విడుదల, ఫిజికల్ ఈవెంట్లకు ఎంతమంది అర్హత సాధించారంటే?

SSC Constable GD Results: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు.

SSC Constable General Duty Results: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 10న వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో రెండు జాబితాల్లో (లిస్ట్-1, లిస్ట్-2) ఫలితాలను అందుబాటులో ఉంచింది.

రాతపరీక్షలో ఉత్తీర్ణులైన వారికి త్వరలో ఫిజికల్ ఈవెంట్లు (PET, PST) నిర్వహిస్తారు. వీటిల్లో పాసైన వారికి తర్వాతి దశంలో మెడికల్ పరీక్షలే, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. చివరకు రిజర్వేషన్‌ ప్రకారం ఉద్యోగాలకు అభ్యర్థులు ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది.

ఫలితాలకు సంబంధించి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను మినహాయించి మొత్తం 3,10,678 మంది పురుషులు; 39,437 మంది మహిళలు ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికయ్యారు. మాల్ ప్రాక్టీస్, కోర్టు ఉత్తర్వుల కారణంగా 1061 మంది అభ్యర్థుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచారు. ఇక 730 మంది అభ్యర్థులను డిబార్ చేశారు. ఫలితాలతో పాటు ప్రశ్నపత్రం, తుది కీని కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జులై 24 డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

LIST-I :LIST OF FEMALE CANDIDATES QUALIFIED FOR PET/PST (IN ROLL NO ORDER)

LIST-II :LIST OF MALE CANDIDATES QUALIFIED FOR PET/PST (IN ROLL NO ORDER)

కటాఫ్ మార్కులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

ప్రశ్నపత్రం, తుది ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

Direct Link

కేంద్ర బలగాల్లో 26,146 కానిస్టేబుల్‌, రైఫిల్‌ మ్యాన్‌ పోస్టుల భర్తీకి గతేడాది నవంబరు 24న స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి నవంబరు 24 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు, సాంకేతిక కారణాల వల్ల కొన్ని కేంద్రాల్లో మార్చి 30న పరీక్షలు నిర్వహించింది. తెలుగుతోపాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించారు. 

ఖాళీల సంఖ్య భారీగా పెంపు..
నోటిఫికేషన్‌లో పేర్కొన ప్రకారం.. మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయాల్సి ఉండగా.. అదనంగా 20,471 పోస్టులను జతచేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,617కి చేరింది. ఇందులో పురుషులకు 41,467 పోస్టులు కేటాయించగా.. మహిళలకు 5150 పోస్టులు కేటాయించారు.

పెరిగిన పోస్టుల వివరాలు ఇలా..

* మొత్తం ఖాళీల సంఖ్య: 46,617 పోస్టులు (గతంలో 26,146)

పోస్టుల కేటాయింపు: యూఆర్-19,596, ఈడబ్ల్యూఎస్-5632, ఓబీసీ-9799, ఎస్టీ-4794, ఎస్సీ-6796.

విభాగం పోస్టుల సంఖ్య (పాతపోస్టులు) పెరిగిన పోస్టులు పోస్టుల కేటాయింపు
బీఎస్‌ఎఫ్‌ 6174 12,076 మెన్ - 10227;
ఉమెన్  - 1849
సీఐఎస్‌ఎఫ్‌ 11025 13,632  మెన్ - 11,558;
ఉమెన్ -  2,074
సీఆర్‌పీఎఫ్‌ 3337 9,410  మెన్ - 9,301;
ఉమెన్ - 109
ఎస్‌ఎస్‌బీ 635 1,926  మెన్ - 1,884;
ఉమెన్ - 42
ఐటీబీపీ 3189 6,287  మెన్ - 5,327;
ఉమెన్ -  960
ఏఆర్ 1490 2,990  మెన్ - 2,948;
ఉమెన్ -  42
ఎస్‌ఎస్‌ఎఫ్‌ 296 296  మెన్ - 222;
ఉమెన్ - 74
మొత్తం ఖాళీలు 26,146 46,617 46,617

SSC GD Constable: కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెరిగిందోచ్ - 46,617కి చేరిన మొత్తం ఖాళీల సంఖ్య

  మారిన పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
KTR: కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
KTR: కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
Mount Everest: ఎవరెస్ట్ అధిరోహించిన ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్
ఎవరెస్ట్ అధిరోహించిన ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్
Jani Master Diwali Celebration: కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్, వారికి అసలైన పండుగ
కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్, వారికి అసలైన పండుగ
Pawan Kalyan: 'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget