అన్వేషించండి

SSC CGLE 2020 Final Result: సీజీఎల్ఈ - 2020 తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 7104 మంది ఎంపిక! కటాఫ్ మార్కులు ఇలా!

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇతర పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వేర్వేరు జాబితాల్లో వెల్లడించారు. ఖాళీలకు అనుగుణంగా మొత్తం 7104 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేశారు.

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ (CGLE)2020 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 31న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (AAO), జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO), ఇతర పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వేర్వేరు జాబితాల్లో వెల్లడించారు. ఖాళీలకు అనుగుణంగా మొత్తం 7104 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేశారు. వీటిలో ఏఏవో పోస్టులకు 250 మంది అభ్యర్థులు, జేఎస్‌వో పోస్టులకు 401 అభ్యర్థులు, ఇక ఇతర ఉద్యోగాలకు 6453 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఉద్యోగాలకు ఎంపిక జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

SSC CGLE 2020 తుది ఫలితాలను ఇలా చూసుకోండి..

Step 1: అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - ssc.nic.in.

Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Results' టాబ్ మీద క్లిక్ చేయాలి.

Step 3: క్లిక్ చేయగానే వచ్చే పేజీలో 'Combined Graduate Level Examination (Final Result), 2020' ఫలితాలకు సంబంధించిన లింక్స్ కనిపిస్తాయి. మొత్తం

3 జాబితాల్లో అభ్యర్థుల ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది.

Step 4: ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటుంది. 

Step 5: అభ్యర్థులు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని, ఫలితాలు చూసుకోవచ్చు. 

Step 6: ఫలితాలు చూసుకోవడానికి కంప్యూటర్ కీబోర్డులో "Ctrl + F" కాంబినేషన్‌లో క్లిక్ చేసి సెర్చ్ బాక్సులో హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. నెంబరు కనిపించనివారు ఎంపికకానట్లే.

సీజీఎల్ -2020 తుది ఎంపిక ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Assistant Audit Officer 

Junior Statistical Officer

Other than AAO/JSO

సీజీఎల్-2020 కటాఫ్ మార్కుల వివరాలు

కంబైన్డ్ గ్రాడ్యుయేట లెవల్ ఎగ్జామ్- 2020 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది జులై 7న నిర్వహించిన టైర్-3 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్/ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించారు. తదనంతరం తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. అంతకు ముందు టైర్-1, టైర్-2 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు టైర్-3 పరీక్షలు నిర్వహించింది. టైర్-4‌లో కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్/ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత. వీటిని క్లియర్​ చేసిన వారి సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ చేసిన తర్వాత తుది జాబితాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.

కంబైన్డ్ గ్రాడ్యుయేట్(సీజీఎల్)–2020 లెవల్ ఆన్​లైన్​ విధానంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఆగస్టు 13 నుండి 24 మధ్య నిర్వహించారు. సెప్టెంబర్​ 2న టైర్​ 1 పరీక్ష కీని విడుదల చేశారు. ఫలితాలను గతేడాది నవంబరులో వెల్లడించారు. ఇక టైర్-2 ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించింది. అదేవిధంగా టైర్-3 కి అర్హత సాధించిన అభ్యర్థులకు జులైలో డిస్క్రిప్టివ్ పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరగా.. టైర్-4 (స్కిల్ టెస్ట్/ డాక్యుమెంట్ వెరిఫికేషన్) నిర్వహించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను కమిషన్ వెల్లడించింది. 

 

Also Read:

SSC Recruitment: 24,369 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ! దరఖాస్తు చేసుకోండి!
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనిద్వారా వివిధ కేంద్ర బలగాల్లో 24,369 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 21,579 పోస్టులు, మహిళలకు 2626 పోస్టులు కేటాయించారు. పదో తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 30 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదిగా నిర్ణయించారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


IB Recruitment 2022: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 1671 ఉద్యోగాలు, టెన్త్ అర్హత చాలు!

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ రీజియన్‌లో 47 ఖాళీలు ఉండగా, విజయవాడ రీజియన్‌లో 7 ఖాళీలు మాత్రమే ఉన్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget