Staff Nurse Exam: స్టాఫ్‌నర్స్ సీబీటీ పరీక్షకు 94.5 శాతం అభ్యర్థులు హాజరు
తెలంగాణలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ఆగస్టు 2న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 94.5 శాతం మంది సీబీటీ పరీక్షకు హాజరయ్యారు.
తెలంగాణలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ఆగస్టు 2న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ప్రశాంతంగా ముగిసింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 94.5 శాతం మంది సీబీటీ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40,936 మంది దరఖాస్తు చేసుకోగా 38,674 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో నాలుగు జిల్లాల(హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం) పరిధిలో ఏర్పాటు చేసిన 39 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌లో 24 కేంద్రాలు, ఖమ్మంలో 6 కేంద్రాలు, నిజామాబాద్‌లో 2 కేంద్రాలు, వరంగల్‌లలో 8 కేంద్రాలు ఉన్నాయి.
వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 30 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.
సీబీటీ పరీక్ష ఇలా..
మొత్తం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. తప్పుగా ఇచ్చిన జవాబులకి నెగెటివ్ మార్కులు ఉండవు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించే పరీక్షను 80 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆలోగా రాయలేకపోతే ఆటోమేటిక్‌గా సెషన్ ముగుస్తుంది. పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుందని, నెగెటివ్ మార్కులు ఉండు. మొత్తం మూడు సెషన్ల (ఉదయం 7.30, ఉదయం 11, మధ్యాహ్నం 2.30)లో పరీక్ష నిర్వహిస్తున్నారు.
ALSO READ:
1207 'స్టెనోగ్రాఫర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2023 ప్రకటనను ఆగస్టు 2న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1207 స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
3049 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..