By: ABP Desam | Updated at : 28 Apr 2023 09:05 AM (IST)
Edited By: omeprakash
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు
దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించనున్న రాతపరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఖరారు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 27న అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రకటించిన తేదీల ప్రకారం ఆగస్టు 2 నుంచి 22 వరకు సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్షలను, సెప్టెంబర్ 1 నుంచి 29 వరకు ఎంటీఎస్ పరీక్షలను, అక్టోబర్ 3 నుంచి 6 వరకు ఎస్‌ఐ(ఢిల్లీ పోలీస్) పరీక్షలను నిర్వహించనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది.
Also Read:
కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు విడుదల, అడ్మిట్‌కార్డులు అందుబాటులో!
సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్ (జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీకి సంబంధించి వాయిదాపడిన శారీరక సామర్థ్య పరీక్షల (పీఈటీ, పీఎస్‌టీ) తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. మే 1 నుంచి 15 వరకు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులను అభ్యర్థలు సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా కోరింది. ఫిజికల్ ఈవెంట్లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేనిదే అనుమతి ఉండదు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్‌టీ, పీఈటీలను ఏప్రిల్ 24 నుంచి మే 8 వరకు నిర్వహించనున్నట్లు సీఆర్‌పీఎఫ్ గతంలోనే ప్రకటించింది. అయితే పాలనాపరమైన కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసింది. అయితే తాజాగా తేదీలను ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను తాజాగా విడుదల చేసింది. శారీరక సామర్థ్య పరీక్షలను మే 1 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా ఈ-అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ సదుపాయం పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకొచ్చింది.
కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్(జీడీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీ జనవరిలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఫిబ్రవరి 18న విడుదల చేసింది. ఈ కీపై ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించారు. తుది కీతో పాటు ఫలితాలు వెల్లడించాక ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లి్క్ చేయండి..
బీఎస్‌ఎఫ్‌లో 247 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు- వివరాలు ఇలా!
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్) గ్రూప్-సి కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లి్క్ చేయండి..
LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్-2023 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం!
CEERI: రాజస్థాన్ సీఎస్‌ఐఆర్-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్ పోస్టులు
TATA STEEL: టాటా స్టీల్-ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!
DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం