CAPFs Constable (GD) Result: కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 24,180 మంది ఎంపిక!
మొత్తం మూడు జాబితాల్లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొదటి జాబితాలో ఉద్యోగాలకు ఎంపికైన మహిళా అభ్యర్థుల వివరాలు, రెండో జాబితాలో ఉద్యోగాలకు ఎంపికైన పురుషుల వివరాలను వెల్లడించింది.
![CAPFs Constable (GD) Result: కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 24,180 మంది ఎంపిక! SSC Constable GD Final Result 2021 declared at ssc.nic.in, direct link to check CAPFs Constable (GD) Result: కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 24,180 మంది ఎంపిక!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/10/9d73d0f94d136aebfc31041f493496831665388410854333_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్, ఎన్‌ఐఏలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల 2021 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిటీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొత్తం మూడు జాబితాల్లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొదటి జాబితాలో ఉద్యోగాలకు ఎంపికైన మహిళా అభ్యర్థుల వివరాలు, రెండో జాబితాలో ఉద్యోగాలకు ఎంపికైన పురుషుల వివరాలను వెల్లడించింది. ఇక మూడో జాబితాలో విత్‌హెల్డ్‌లో ఉంచిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది.
మొత్తం 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలకుగాను 24,180 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. 849 మంది అభ్యర్థుల (97 మహిళలు, 752 పురుషులు) ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచింది. ఉద్యోగాలకు ఎంపికైనవారిలో 2847 పోస్టులకుగాను 2598 మంది మహిళలు; 22,424 పోస్టులకుగాను 20,734 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు.
LIST-I: FEMALE CANDIDATES RECOMMENDED FOR APPOINTMENT IN ROLL NO ORDER
LIST-II: MALE CANDIDATES RECOMMENDED FOR APPOINTMENT IN ROLL NO ORDER
LIST-III: WITHHELD CANDIDATES (MALE & FEMALE)IN ROLL NO ORDER
ఫలితాలు, కటాఫ్ మార్కులకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఏపీఎఫ్, ఎన్‌ఐఏ, ఎస్ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ పోస్టులు, అసోం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది నవంబరు 16 నుంచి డిసెంబరు 15 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను ఈ ఏడాది మార్చి 25న విడుదల చేశారు. పరీక్షకు హాజరైనవారిలో 2,85,201 మంది అభ్యర్థులు పీఈటీ/పీఎస్‌టీ పరీక్షలకు అర్హత సాధించారు. వీరిలో మహిళలు-31,657, పురుషులు-2,53,544 మంది ఉన్నారు. వీరికి ఫిజికల్ పరీక్ష అనంతరం ఆగస్టు 12న ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 69,287 మంది అభ్యర్థులు (ఉమెన్-7,465 , మెన్-61,822) తదుపరి దశకు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబరు 12 నుంచి అక్టోబరు 4 వరకు మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అనంతరం తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
Also Read:
ECIL Walkin: ఈసీఐఎల్‌లో 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు! వాక్‌ఇన్ షెడ్యూలు ఇదే!
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 13, 14 తేదీల్లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. అర్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ క్యాంపస్‌లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు.
వాక్ ఇన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
SAIL Recruitment: సెయిల్‌లో 245 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, అర్హతలివే!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2022 అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్ధులు నవంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
డీఆర్‌డీవో ఉద్యోగాలకు ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే?
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనేజేషన్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)