అన్వేషించండి

SSC CGL Results: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!

కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ (సీజీఎల్)-2022 పరీక్ష (టైర్- 1) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టైర్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.

 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ (సీజీఎల్)-2022 పరీక్ష (టైర్- 1) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టైర్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. మొత్తం 3,86,652 మంది అభ్యర్థులు టైర్-2 పరీక్షకు అర్హత సాధించారు.

మొత్తం 3 జాబితాల్లో ఫలితాలను ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. వీరిలో మొదటి జాబితాలో 25071 మంది అభ్యర్థులు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్& అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు, రెండో జాబితాలో 1149 మంది అభ్యర్థులు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు, మూడో జాబితాలో 3,60,432 మంది అభ్యర్థులు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు సంబంధించి టైర్-2 కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఉన్నాయి. అయితే వివిధ కారణాల చేత 134 మంది అభ్యర్థుల వివరాలను పెండింగ్‌లో ఉంచారు. గతేడాది డిసెంబర్ 1 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. టైర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులు టైర్-2 పరీక్షకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. 

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గతేడాది కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్(సీజీఎల్), కంబైన్డ్ హ య్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష (సీహెచ్‌ఎస్‌ఎల్)కు నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీజీఎల్ టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన టైర్-2 పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 6న ప్రకటించింది. వీటిలో గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి టైర్-2 పరీక్షను మార్చి 2 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ ఫిబ్రవరి 6న ప్రకటించింది.

అలాగే, 4500 లోయర్ డివిజన్ క్లర్కులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర ఉద్యోగాలను భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్ష టైర్-1ను మార్చి 9 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్లు ఎప్పటికప్పుడు తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందొచ్చని అభ్యర్థులకు సూచించింది.

Also Read: సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షల తేదీలు ఖరారు! షెడ్యూలు ఇదే!

List-1: Assistant Audit Officer & Assistant Accounts Officer Posts

List-2:  Junior Statistical Officer Posts

List-3: Statistical Investigator Gr. II Posts

Website

జీఎల్-2022 పోస్టుల వివరాలు..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవలే  కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్(SSC CGL)-2022ను సెప్టెంబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు 19, 20 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 1 నుండి 13 సీజీఎల్ 'టైర్-1' పరీక్షలు నిర్వహించింది. అడ్మిట్ కార్డ్ విడుదలకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే నవంబరు మూడోవారం నుంచి అడ్మిట్ కార్డులు జారీచేసే అవకాశం ఉంది. 

SSC CGL 2022 నోటిఫికేషన్, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..

టైర్-2 పరీక్ష:
SSC CGL Results: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget