అన్వేషించండి

SBI PO Prelims Result 2023: ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

SBI PO Prelims Result: ఎస్‍బీఐ పీవో ప్రిలిమ్స్-2023 (Prelims) ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) నవంబరు 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

SBI PO Prelims Result: ఎస్‍బీఐ పీవో ప్రిలిమ్స్-2023 (Prelims) ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) నవంబరు 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 5న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

SBI PO Prelims Results చూసుకోండిలా..

➥ అభ్యర్థులు ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. -sbi.co.in 

➥ అక్కడ హోమ్ పేజీలో కెరీర్స్ (Careers) ట్యాబ్‍పై క్లిక్ చేయాలి.

➥ అక్కడ SBI PO Prelims Results 2023 లింక్ మీద క్లిక్ చేయాలి. 

➥ తర్వాత అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి.

➥  లాగిన్ వివరాలు నమోదుచేయగానే.. స్క్రీన్ మీద ఫలితాలు కనిపిస్తాయి.

➥ భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాల పేజీని డౌన్‍లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

భారతదేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు సెప్టెంబరు 7న ప్రారంభం కాగా.. దరఖాస్తు గడువును అక్టోబరు వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులను నవంబరు 1, 4, 6 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 5న మెయిన్ పరీక్షల నిర్వహించనున్నారు. ఇందులోనూ అర్హత సాదించినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 6న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 7 నుంచి అక్టోబరు 3 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తాజాగా ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఎస్‌బీఐ విడుదల చేసింది.

మెయిన్ పరీక్ష విధానం:
మొత్తం 250 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు-50 మార్కులు, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 30 ప్రశ్నలు -40 మార్కులు, జనరల్ ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 35 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. ఇక డిస్క్రిప్టివ్ పేపర్‌లో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ పశ్నలకు 50 మార్కులు ఉంటాయి.
SBI PO Prelims Result 2023: ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

సైకోమెట్రిక్ టెస్ట్:
అభ్యర్థుల పర్సనాలిటి ప్రొఫైల్‌ను అంచనా వేయడానికి సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. మొతం 50 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటాయి.
SBI PO Prelims Result 2023: ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
తుది ఎంపిక ఇలా:
మొత్తం 300 మార్కులకు తుది ఎంపిక కోసం నిర్ణయించారు. ఇందులో అభ్యర్థులు మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులు; గ్రూప్ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మెయిన్ ఎగ్జామ్‌కు 250 మార్కుల, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి. ఇక అభ్యర్థుల నార్మలైజ్డ్ మార్కులను మెయిన్ పరీక్షకు 75గా, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కులుగా నిర్ణయించారు.
SBI PO Prelims Result 2023: ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget