SBI PO Admit Card: వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ పీవో మెయిన్ హాల్‌టికెట్లు, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష ఎప్పుడంటే?
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. జనవరి 30 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి.
ఎస్బీఐ పీవో-2022 మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. పీవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. జనవరి 30 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్-2022 ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 17న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 30న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
SBI PO Prelims Results చూసుకోండిలా..
➥ అభ్యర్థులు ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. -sbi.co.in
➥ అక్కడ హోమ్ పేజీలో కెరీర్స్ (Careers) ట్యాబ్‍పై క్లిక్ చేయాలి.
➥ అక్కడ SBI PO Mains Admit Card 2022 లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ తర్వాత అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి.
➥ లాగిన్ వివరాలు నమోదుచేయగానే.. స్క్రీన్ మీద అడ్మిట్‌కార్డు కనిపిస్తుంది.
➥ భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాల పేజీని డౌన్‍లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంటతీసుకెళ్లాలి.
మెయిన్ పరీక్ష విధానం..
మొత్తం 250 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు-50 మార్కులు, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 30 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 35 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. ఇక డిస్క్రిప్టివ్ పేపర్‌లో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ పశ్నలకు 50 మార్కులు ఉంటాయి.
ప్రభుత్వరంగ బ్యాంకు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' వివిధ శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 21న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు డిసెంబరు 17 నుంచి 20 వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. వీటి ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి జనవరి 30న ఆన్‌లైన్ విధానంలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. తదనంతరం సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి/మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహించి.. మార్చి చివరి నాటికి తుది ఎంపిక ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఎస్‌బీఐ పీవో నోటిఫికేషన్, ఎంపిక పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..
➥ నేషనల్ హౌజింగ్ బ్యాంకులో 36 మేనేజర్, ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!
➥ కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, 111 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!