ప్రారంభ బేసిక్ సాలరీ రూ. 24,050 – రూ. 64,480 వరకు ఉంటుంది. మెట్రో సిటీలు, పట్టణాల్లో డీఏ, హెచ్ఆర్ఏతో కలిపి స్టార్టింగ్ పే రూ. 46,000 వరకు ఉంటుంది.
SBI Junior Associates Recruitment : ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. భారీ జీతం, అలెవెన్సులు.. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఇవే!
SBI Junior Associates Recruitment : ఎస్బీఐలో 9124 జూనియర్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత కలిగి అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 46,000 వరకు ప్రారంభ జీతం.
SBI Junior Associates Recruitment : ఎస్బీఐలో దేశవ్యాప్తంగా 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అధికారిక వెబ్‌సైట్ https://sbi.bank.in/web/careers/current-openings లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ విధానం, జీతభత్యాలు వివరాలు తెలుసుకుందాం.
ముఖ్యాంశాలు
- మొత్తం పోస్టులు: 9,124 (రెగ్యులర్: 7,680, బ్యాక్‌లాగ్: 1,444)
- ఆగస్టు 11, 2026 నుంచి అప్లికేషన్లు ప్రారంభం
- ఆగస్టు 31,2026 దరఖాస్తుకు చివరి తేదీ
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎగ్జామ్ ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ. 750.
పరీక్ష తేదీలు
ప్రిలిమ్స్ - సెప్టెంబర్ 2026
మెయిన్స్ - నవంబర్ 2026
సెలక్షన్ ప్రాసెస్
1.ప్రిలిమ్స్
2.మెయిన్స్ పరీక్ష
ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. 10 లేదా 12వ తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివితే అభ్యర్థులకు లోకల్ లాంగ్వేజ్ ఎగ్జా్మ్ నుంచి మినహాయింపు ఉంటుంది.
పరీక్షా విధానం
ప్రిలిమినరీ ఎగ్జామ్
ప్రిలిమ్స్ పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. 60 నిమిషాలు సమయం ఇస్తారు. ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ రూపంలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్కులు, రీజనింగ్ 35 మార్కులకు ఇస్తారు.
Also Read : ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
మెయిన్స్
మెయిన్స్ ఎగ్జామ్‌ను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. 2 గంటల 40 నిమిషాల సమయం ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో 190 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. జనరల్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 మార్కులు, ఇంగ్లీష్ 40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్కులు, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 60 మార్కులకు ఇస్తారు.
Also Read : 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్ క్యాలెండర్ వచ్చేసింది
జీతం
జూనియర్ అసోసియేట్లకు స్టార్టింగ్ బేసిక్ సాలరీ రూ. 24,050 – రూ. 64,480 వరకు ఉంటుంది. స్టార్టింగ్‌లో నెలకు 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్లతో కలిపి బేసిక్ పే రూ. 26,780 వస్తుంది. మెట్రో సిటీలు, పట్టణాల్లో డీఏ, హెచ్ఆర్ఏతో కలిపి స్టార్టింగ్ పే రూ. 46,000 వరకు ఉంటుంది. వీటితో పాటు పెన్షన్, మెడికల్, ట్రావెల్ అలవెన్స్ కూడా ఉంటాయి.
Also Read : రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Frequently Asked Questions
జూనియర్ అసోసియేట్లకు ప్రారంభ జీతం ఎంత ఉంటుంది?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















