అన్వేషించండి

RRB Group D Result: ఆర్ఆర్‌బీ 'గ్రూప్-డి' ఫలితాలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడంటే? అర్హత మార్కులివే!

రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.18,000 జీతం.

ఇండియన్ రైల్వేలో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (సీబీటీ) ఫలితాలు త్వరలోనే వెలువనున్నాయి. నవంబరు రెండో వారంలో ఫలితాలు వెలవడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఫలితాలతోపాటు ఫైనల్ కీ, కటాఫ్ మార్కుల వివరాలను కూడా రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్ విడుదల చేయనుంది.

ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ (పుట్టినతేది) వివరాలను నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.18,000 జీతం (7వ పే సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం).

ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో లెవల్-1 కింద 1,03,769 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్-42,355; ఎస్సీ-15,559, ఎస్టీ-7,984, ఓబీసీ-27,378; ఈడబ్ల్యూఎస్-10,381 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 17 నుంచి అక్టోబరు 11 వరకు మొత్తం 5 విడతల్లో సీబీటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా కోటికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. 

రైల్వేల్లో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అక్టోబరు 14న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రం, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆన్సర్ కీపై అక్టోబరు 15 నుంచి 19 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించింది. దీంతో నవంబరు మూడోవారంలో తుది ఆన్సర్ కీతోపాటు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పరీక్ష ఇలా...

✪ మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) రాత పరీక్ష 5 దశల్లో నిర్వహించారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.

✪ పరీక్ష సమయాన్ని దివ్యాంగులకు 120 నిమిషాలు, ఇతరులకు 90 నిమిషాలుగా నిర్ణయించారు.

✪ పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3  మార్కుల చొప్పున కోత విధిస్తారు.

✪ అర్హత మార్కులను జనరల్-40%, ఈడబ్ల్యూఎస్-40%, ఓబీసీ-30%, ఎస్సీ-30%, ఎస్టీ-30% గా నిర్ణయించారు.

✪ దివ్యాంగులకు అదనంగా 2% మినహాయింపునిచ్చారు.


Also Read:

SSC CGL 2022 Exam Date: సీజీఎల్-2022 'టైర్-1' పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవలే  కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్(SSC CGL)-2022 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు 19, 20 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. 
పరీక్ష తేదీలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


SSC SA Exam Date: ఐఎండీ సైంటిఫిక్ అసిస్టెంట్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?

భారత వాతావరణ శాఖలో 990 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 18 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబరు 25న దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్ష తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా వెల్లడించింది. 
పరీక్షల షెడ్యూలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget