RRB RPF SI Exam: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్‌ఐ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు వచ్చేశాయ్, మీ పరీక్ష కేంద్రమేదో తెలుసుకోండి ఇలా
RPF: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్‌ఐ ఉద్యోగాల నియామక పరీక్ష 'సిటీ ఇంటిమేషన్ స్లిప్పు'లను రైల్వేశాఖ విడుదల చేసింది. అభ్యర్థులకు డిసెంబర్ 2, 3, 9, 12, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
RPF SI City Intimation Slip 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన 'సిటీ ఇంటిమేషన్ స్లిప్పు'లను రైల్వేశాఖ నవంబరు 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, యూజర్ పాస్‌వర్డ్/ పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, మార్గదర్శకాలు తదితర సమాచారం ఉంటుంది. ఇక పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (Admit Card) త్వరలోనే విడుదల కానున్నాయి. నవంబరు 29న అడ్మిట్ కార్డులు వెలువడే అవకాశం ఉంది.
ఆర్పీఎఫ్ ఎస్‌ఐ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 452 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి మార్చి నెలలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఖాళీల్లో 384 పురుషులకు, 68 మహిళలకు కేటాయించారు. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 15 నుంచి 24 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 2, 3, 9, 12, 13 తేదీల్లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష విధానం..
మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, అరిథ్‌మెటిక్ 35 ప్రశ్నలు-35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
ఆర్‌పీఎఫ్ పీఈటీ (ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్): రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఫిజికల్ ఈవెంట్ల నిర్వహణ కింది విధంగా ఉంటుంది.
విభాగం | 1600 మీటర్ల పరుగు | 800 మీటర్ల పరుగు | లాంగ్ జంప్ | హైజంప్ |
ఎస్‌ఐ (మెన్) | 6.30 నిమిషాలు | - | 12 ఫీట్లు | 3 ఫీట్ల 9 అంగుళాలు |
ఎస్‌ఐ (ఉమెన్) | - | 4 నిమిషాలు | 9 ఫీట్లు | 3 ఫీట్లు |
ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT):
ఆర్‌పీఎఫ్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) | ||||
విభాగం | ఎత్తు (సెం.మీ.లలో ) | ఛాతీ (సెం.మీ.లలో ){పురుషులకు మాత్రమే} | ||
జనరల్/ఓబీసీ | 165 | 157 | 80 | 85 |
ఎస్సీ/ఎస్టీ | 160 | 152 | 76.2 | 81.2 |
గర్వాలీలు, గూర్ఖాలు, మరాఠాలు, డోగ్రాలు, కుమాయోనీస్ మరియు ప్రభుత్వం పేర్కొన్న ఇతర కేటగిరీలకు చెందినవారికి | 163 | 155 | 80 | 85 |
డాక్యుమెంట్ వెరిఫికేషన్:
అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరికి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఉద్యోగాల సంఖ్యకు అనుగుణంగా సరైన అర్హతలు, ధ్రువపత్రాలు ఉన్నవారికి ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. అభ్యర్థులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం నుంచి నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ - NOC) తీసుకోవాల్సి ఉంటుంది.
ALSO READ:
➥ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, నియామక పరీక్షల షెడ్యూలు విడుదల - తేదీలు ఇవే
➥ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా