అన్వేషించండి

RBI Assistant scorecard 2023: ఆర్‌బీఐ అసిస్టెంట్ ప్రిలిమ్స్ స్కోరుకార్డు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోండి

RBI: ఆర్‌బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష స్కోరుకార్డులు అందుబాటులోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 31న మార్కుల షీట్‌ను విడుదల చేసింది.

RBI Assistant Scorecard: ఆర్‌బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష స్కోరుకార్డులు అందుబాటులోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 31న మార్కుల షీట్‌ను విడుదల చేసింది.  అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/రూల్ నెంబరు, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జులై 31 వరకు స్కోరుకార్డులు అందుబాటులో ఉండనున్నాయి. మెయిన్ పరీక్షలకు సంబంధించిన స్కోరుకార్డులను ఫలితాలు వెల్లడించిన తర్వాత విడుదలచేస్తారు.

Download RBI Assistant Prelims Score Card 2023

దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు మొదటివారంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబర్‌ 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు.

అభ్యర్థులకు నవంబరు 18, 19 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను డిసెంబరు 15న విడుదల చేశారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 31న మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్ పరీక్ష ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. తాజాగా ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన స్కోరుకార్డును ఆర్‌బీఐ విడుదలచేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.20,700 నుంచి రూ.55700 జీతంగా ఇస్తారు.

పోస్టుల వివరాలు..

➥ అసిస్టెంట్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 450

శాఖల వారీగా ఖాళీలు..

➥ అహ్మదాబాద్: 13

➥ బెంగళూరు: 58

➥ భోపాల్: 12

➥ భువనేశ్వర్: 19

➥ చండీగఢ్: 21

➥ చెన్నై: 01

➥ గువాహటి: 26

➥ హైదరాబాద్: 14

➥ జైపుర్: 5

➥ జమ్మూ: 18

➥ కాన్పుర్ & లక్నో: 55

➥ కోల్‌కతా: 22

➥ ముంబయి: 101

➥ నాగ్‌పుర్: 19

➥ న్యూఢిల్లీ: 28

➥ పట్నా: 01

➥ తిరువనంతపురం & కొచ్చి: 16.

పరీక్ష విధానం..

* ప్రాథమిక పరీక్ష(ఆబ్జెక్టివ్‌)లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(30 ప్రశ్నలు- 30 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు), రీజనింగ్‌ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

* ప్రధాన పరీక్ష(ఆబ్జెక్టివ్‌)లో రీజనింగ్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ(40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్‌ నాలెడ్జ్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు.

* మెయిన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు.

నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు, పరీక్షల షెడ్యూలు వెల్లడి
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ఏఎల్‌పీ) కొలువులకు ఆర్‌ఆర్‌బీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయోపరిమితిని 18-30 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అయితే వయోపరిమితిని మూడేళ్లు పెంచుతున్నట్లు రైల్వేశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా నిర్ణయం ప్రకారం ఏఎల్‌పీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జులై 1 నాటికి 18-33 సంవత్సరాలలోపు ఉండాలని తెలిపింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?

వీడియోలు

JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget