RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు వెంటనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబర్ 4తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు వెంటనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివరాలు..
* అసిస్టెంట్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 450
శాఖల వారీగా ఖాళీలు..
➥ అహ్మదాబాద్: 13
➥ బెంగళూరు: 58
➥ భోపాల్: 12
➥ భువనేశ్వర్: 19
➥ చండీగఢ్: 21
➥ చెన్నై: 01
➥ గువాహటి: 26
➥ హైదరాబాద్: 14
➥ జైపుర్: 5
➥ జమ్మూ: 18
➥ కాన్పుర్ & లక్నో: 55
➥ కోల్‌కతా: 22
➥ ముంబయి: 101
➥ నాగ్‌పుర్: 19
➥ న్యూఢిల్లీ: 28
➥ పట్నా: 01
➥ తిరువనంతపురం & కొచ్చి: 16
అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. పీసీ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.
వయోపరిమితి: 01-09-2023 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల(జనరల్) సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.50.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పే స్కేల్: నెలకు రూ.20,700 నుంచి రూ.55700.
పరీక్ష విధానం: ప్రాథమిక పరీక్ష(ఆబ్జెక్టివ్)లో ఇంగ్లిష్ లాంగ్వేజ్(30 ప్రశ్నలు- 30 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రధాన పరీక్ష(ఆబ్జెక్టివ్)లో రీజనింగ్(40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్(40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ(40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్(40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్(40 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 13.09.2023 నుంచి 04.10.2023 వరకు.
➥ ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు: 13.09.2023 నుంచి 04.10.2023 వరకు.
➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ టెస్ట్ తేదీలు: 21.10.2023, 23.10.2023.
➥ ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ తేదీ: 02.12.2023.
ALSO READ:
ఎస్ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ 'టైర్-1' హాల్‌టికెట్లు విడుదల, రీజియన్ల వారీగా అందుబాటులో
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న టైర్-1(సీబీటీ) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. రీజియన్లవారీగా హాల్‌టికెట్లను ఆయా రీజియన్ల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
స్టెనోగ్రాఫర్ అభ్యర్థులకు అలర్ట్. 'అప్లికేషన్ స్టేటస్' వివరాలు చెక్ చేసుకోండి
స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ టైర్-1 (ప్రిలిమినరీ) పరీక్ష హాల్‌టికెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అడ్మిట్ కార్డులను రీజియన్లవారీగా ఆయా వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 12, 13 తేదీల్లో స్టెనోగ్రాఫర్ టైర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష హాల్‌టికెట్లను రెండు, మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి నో యువర్ స్టేటస్, అభ్యర్థి రోల్ నెంబరు తదితర వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..