JIPMER: జిప్‌మర్‌లో 82 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
JIPMER: పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(JIPMER) రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IPMER, Puducherry Recruitment: పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(JIPMER) రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 19 నుంచి జనవరి 8 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు బేసిక్ పే రూ.67,700 కింద మొత్తం రూ.1,10,000 జీతంగా ఇస్తారు.
వివరాలు..
* సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 82.
➥ జిప్‌మర్-పుదుచ్చేరి: 66 పోస్టులు
➥ జిప్‌మర్-కరైకాల్: 16 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-37, ఓబీసీ-12, ఎస్సీ-08, ఎస్టీ-19, ఈడబ్ల్యూఎస్-06.
విభాగాలవారీగా ఖాళీలు..
➥ అనస్థీషియాలజీ & క్రిటికల్ కేర్: 11
➥ అనాటమీ: 01
➥ బయోకెమిస్ట్రీ: 03
➥ డెర్మటాలజీ: 02
➥ ఎమర్జెన్సీ మెడిసిన్: 02
➥ ఈఎన్‌టీ: 01
➥ ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ: 04
➥ జనరల్ మెడిసిన్: 06
➥ జనరల్ సర్జరీ: 09
➥ గెరియాట్రిక్ మెడిసిన్: 01
➥ మైక్రోబయాలజీ: 05
➥ నియోనాటాలజీ: 01
➥ న్యూక్లియర్ మెడిసిన్: 03
➥ అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ: 03
➥ ఆప్తాల్మాలజీ: 04
➥ ఆర్థోపెడిక్స్: 04
➥ పీడియాట్రిక్స్: 04
➥ ఫార్మకాలజీ: 01
➥ సైకాలజీ: 02
➥ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్: 01
➥ ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్: 02
➥ పాథాలజీ: 01
➥ సైకియాట్రీ: 02
➥ పల్మొనరీ మెడిసిన్: 04
➥ రేడియేషన్ ఆంకాలజీ: 01
➥ రేడియో డయాగ్నసిస్: 04
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 28.02.2024 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు జనరల్-10, ఓబీసీ-13, ఎస్సీ-ఎస్టీ-15 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1200 చెల్లించాలి. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
రాతపరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 40 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో కనీస అర్హత మార్కులను జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 శాతం (40 మార్కులు), జనరల్-దివ్యాంగులకు 45 శాతం (36 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు 40 శాతం (32 మార్కులు)గా నిర్ణయించారు. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు: చెన్నై, ఢిల్లీ/ఎన్‌సీఆర్, కోల్‌కతా, ముంబయి, పుదుచ్చేరి.
జీతం: నెలకు రూ.1,10,000 (బేసిక్ పే రూ.67,700).
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.12.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.01.2024.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 13.01.2024.
➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 20.01.2024.