News
News
X

Postal Jobs: చెన్నై మెయిల్ మోటార్ సర్వీసులో 58 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు!

పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు చేపడతారు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

FOLLOW US: 
Share:

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కు చెందిన చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్ తమిళనాడు సర్కిల్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు చేపడతారు.

వివరాలు..

స్టాఫ్ కార్ డ్రైవర్: 58 పోస్టులు

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్‌లో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాలవరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా రిజిస్ట్రర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

జీతం: నెలకు రూ.19,900 - రూ.63,200.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Senior Manager (JAG),
Mail Motor Service,
No.37, Greams Road, 
Chennai - 600 006.

దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2023.

Notification & Application

Website

Also Read:

హెచ్‌ఏఎల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. డిప్లొమా, బీఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, దిగ్బాయ్, పారాదీప్ రిఫైనరీ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 5,395 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని  ద్వారా మొత్తం 5,395 ఐటీఐ, నాన్ ఐటీఐ ఖాళీలను భర్తీచేయనున్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు. నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000; ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 04 Mar 2023 06:17 AM (IST) Tags: Post Office Jobs Staff Car Driver Posts Tamilnadu Postal Circle Postsal Jobs Post Office Car Driver Posts

సంబంధిత కథనాలు

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Group 1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలివే?

Group 1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలివే?

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్