RECPDCL: ఆర్‌ఈసీపీడీసీఎల్‌లో డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
REC PDCL Jobs: ఆర్‌ఈసీ పీడీసీఎల్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
REC PDCL Notification: భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖ పరిధిలోని 'రూరల్ ఎలక్ట్రీఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (REC PDCL)' వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 25 డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జులై 25 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 25.
➥ డిప్యూటీ మేనేజర్(ఇంజినీరింగ్): 04 పోస్టులు
అర్హత: రెగ్యులర్ ఫుల్ టైమ్ బీఈ/బీటెక్ లేదా తత్సమానం(ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ సివిల్) లేదా తత్సమానం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 39 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.70,000-2,00,000.
➥ ఆఫీసర్ (ఇంజినీరింగ్): 10 పోస్టులు
అర్హత: రెగ్యులర్ ఫుల్ టైమ్ బీఈ/బీటెక్ లేదా తత్సమానం(ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ సివిల్) లేదా తత్సమానం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 33 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.50,000-1,60,000.
➥ డిప్యూటీ మేనేజర్ (ఎఫ్&ఏ): 01
అర్హత: చార్టర్డ్ అకౌంటెన్సీ/కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 39 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.70,000-2,00,000.
➥ ఆఫీసర్ (ఎఫ్&ఏ): 01
అర్హత: చార్టర్డ్ అకౌంటెన్సీ/కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 33 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.50,000-1,60,000.
➥ డిప్యూటీ మేనేజర్ (హెచ్‌ఆర్): 01
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి రెగ్యులర్ ఫుల్‌టైమ్ రెండు సంవత్సరాల ఎంబీఏ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా లేదా హెచ్‌ఆర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో స్పెషలైజేషన్‌తో సమానం లేదా మొదటి డివిజన్ లేదా సమానమైన సీజీపీఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 39 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.70,000-2,00,000.
➥ ఆఫీసర్ (హెచ్‌ఆర్): 01
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి రెగ్యులర్ ఫుల్‌టైమ్ రెండు సంవత్సరాల ఎంబీఏ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా లేదా హెచ్‌ఆర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో స్పెషలైజేషన్, ఎంసీఏ/ఎంటెక్/ఎంసీఎస్/ ఎంఎస్సీ(ఐటీ)/కంప్యూటర్ సైన్స్ సమానం లేదా మొదటి డివిజన్ లేదా సమానమైన సీజీపీఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 33 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.50,000-1,60,000.
➥ డిప్యూటీ మేనేజర్ (ఐటీ): 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి రెగ్యులర్ ఫుల్ టైమ్ బీఈ/బీటెక్ లేదా తత్సమానం (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా మొదటి డివిజన్ లేదా సమానమైన సీజీపీఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 39 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.70,000-2,00,000.
➥ ఆఫీసర్ (ఐటీ): 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి రెగ్యులర్ ఫుల్ టైమ్ బీఈ/బీటెక్ లేదా తత్సమానం (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా మొదటి డివిజన్ లేదా సమానమైన సీజీపీఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 33 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.50,000-1,60,000.
➥ డిప్యూటీ మేనేజర్ (సీఎస్): 01
అర్హత: గ్రాడ్యుయేషన్ (అసోసియేట్/ఫెలో మెంబర్‌షిప్) ఉత్తీర్ణత ఉండాలి. 7 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 39 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.70,000-2,00,000.
➥ ఆఫీసర్ (సీఎస్): 01 పోస్టు
అర్హత: గ్రాడ్యుయేషన్ (అసోసియేట్/ఫెలో మెంబర్‌షిప్) ఉత్తీర్ణత ఉండాలి. 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 33 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.50,000-1,60,000.
➥ డిప్యూటీ మేనేజర్ (లా): 01 పోస్టు
అర్హత: లా డిగ్రీ (మూడేళ్లు/ఐదేళ్లు) గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. 7 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 39 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.70,000-2,00,000.
➥ ఆఫీసర్ (లా): 01 పోస్టు
అర్హత: లా డిగ్రీ (మూడేళ్లు/ఐదేళ్లు) గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. 2 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 33 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.50,000-1,60,000.
➥ ఆఫీసర్ (CSR): 01 పోస్టు
అర్హత: ఎంబీఏ/ పీజీడీఎం/ పీజీడీ లేదా సోషల్ వర్క్/తత్సమాన విద్యార్హత ఉండాలి. 2 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 33 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.50,000-1,60,000.
దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 25.07.2024.