PhD: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఇకపై ఆ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి కాదు, యూజీసీ కీలక నిర్ణయం!
విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువులకు పోటీపడాలంటే పీహెచ్‌డీని తప్పనిసరి చేస్తూ 2018లో యూజీసీ జారీ చేసిన నిబంధనలను తాజాగా యూజీసీ సవరించింది.
ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి నిబంధనను తొలగించినట్టు వెల్లడించింది. ఇకపై ఈ పోస్టులకు పీహెచ్‌డీ అవసరం లేదని, ఐచ్ఛికమేనని స్పష్టంచేసింది. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. అన్ని ఉన్నత విద్యా సంస్థల్లోనూ నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ఆయా అభ్యర్థులు నెట్/సెట్/స్లెట్ పరీక్షల్లో అర్హత సాధిస్తే చాలని పేర్కొంది.
విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువులకు పోటీపడాలంటే పీహెచ్‌డీని తప్పనిసరి చేస్తూ 2018లో యూజీసీ నిబంధనలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకాలపై యూజీసీ 2018లో జారీచేసిన నిబంధనలు జులై 1 నుంచే దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. తాజాగా ఆ నిబంధనలను యూజీసీ సవరించడంతో ఇకపై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పీహెచ్‌డీ డిగ్రీ తప్పనిసరి కాదు. దీంతో బోధనపట్ల ఆసక్తి కలిగి పీహెచ్‌డీ డిగ్రీలేని ఎంతోమంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కలగనుంది.
ALSO READ: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఎప్పుడంటే?
ఎస్‌ఎస్‌సీ- కానిస్టేబుల్(జీడీ) నియామకాలకు సంబంధించి జులై 17 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేట్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. త్వరలో ఈ అడ్మిట్ కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుచనున్నట్లు సీఆర్‌పీఎఫ్ వెల్లడించింది. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి పీఈటీ/ పీఎస్‌టీ ఫలితాలు జులై 30న విడుదలైన సంగతి తెలిసిందే. శారీరక సామర్థ్య పరీక్షలకు మొత్తం 3.70 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. 1.46 లక్షల మంది వైద్య పరీక్షలకు అర్హత సాధించారు. పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 1045 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!
హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణత గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 31 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో 42 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు, అర్హతలివే!
హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 42 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జులై 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial