అన్వేషించండి

APPSC JL Recruitment: జూనియర్ లెక్చరర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

ఏపీలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభమైంది. ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

APPSC JL Recruitment: ఏపీలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి డిసెంబరు 28న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ లేదా ఆనర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు. 

వివరాలు..

* జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులు

ఖాళీల సంఖ్య: 47

జోన్లవారీగా ఖాళీలు..

జోన్-1: 12, జోన్-2: 10, జోన్-3: 09, జోన్-4: 16.

సబ్జెక్టులవారీగా ఖాళీలు..

➥ ఇంగ్లిష్: 09 పోస్టులు  

➥ తెలుగు: 02 పోస్టులు

➥ ఉర్దూ: 02 పోస్టులు

➥ సంస్కృతం: 02 పోస్టులు

➥ ఒరియా: 01 పోస్టు 

➥ మ్యాథమెటిక్స్: 01 పోస్టు

➥ ఫిజిక్స్: 05 పోస్టులు

➥ కెమిస్ట్రీ: 03 పోస్టులు

➥ బోటనీ: 02 పోస్టులు

➥ జువాలజీ: 01 పోస్టు 

➥ ఎకనామిక్స్: 12 పోస్టులు

➥ సివిక్స్: 02 పోస్టులు

➥ హిస్టరీ: 05 పోస్టులు

అర్హత: ఎంఏ/ ఎంఎస్సీ/ఎంకామ్/బీఏ(ఆనర్స్)/ బీఎస్సీ(ఆనర్స్)/ బీకామ్ (ఆనర్స్) లేదా  కనీసం 50 శాతం మార్కులతో  సంబంధిత రంగంలో ఏదైనా ఇతర సమానమైన పీజీ డిగ్రీ కలిగి ఉండాలి. సివిక్స్ సబ్జెక్టులు పొలిటికల్ సైన్స్ విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:  28.12.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.

రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ(డిగ్రీ స్థాయి) - 150 ప్రశ్నలు- 150 మార్కులు- 150 నిమిషాలు; పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు (పీజీ స్థాయి) - 150 ప్రశ్నలు- 300 మార్కులు- 150 నిమిషాలు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కుకాగా.. పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ఇక ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.

కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.

జీతం: రూ.57,100 - రూ.1,47,760.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.02.2024. (11:59 PM)

➥ రాతపరీక్ష తేది: ఏప్రిల్/మే, 2024.

Notification

Detailed Notification

Online Application

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Vs Vijayasai Reddy : వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్ ఉన్న వాడిని- జగన్‌కు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్ ఉన్న వాడిని- జగన్‌కు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - రెపో రేట్‌ కట్‌ చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ - తగ్గనున్న వడ్డీ రేట్లు, EMIలు
బ్రేకింగ్‌ న్యూస్‌ - రెపో రేట్‌ కట్‌ చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ - తగ్గనున్న వడ్డీ రేట్లు, EMIలు
Ramgopal Varma: ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
Thandel Movie Review - తండేల్ రివ్యూ: సముద్రంలో చిక్కిన ప్రేమ... తీరానికి ఎలా చేరింది? నాగచైతన్య సినిమా హిట్టా? ఫట్టా?
తండేల్ రివ్యూ: సముద్రంలో చిక్కిన ప్రేమ... తీరానికి ఎలా చేరింది? నాగచైతన్య సినిమా హిట్టా? ఫట్టా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Jai Shankar on Deportation | మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయరు | ABP DesamSheikh Hasina Home Set on Fire | షేక్ హసీనా తండ్రి నివాసాన్ని తగులబెట్టిన ఆందోళనకారులు | ABP DesamIllegal Immigrants Deportation | పార్లమెంటులో భగ్గుమన్న ప్రతిపక్షాలు | ABP DesamUSA illegal Indian Migrants Aircraft | అమృత్ సర్ లో దిగిన విమానం వెనుక ఇంత కథ ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Vs Vijayasai Reddy : వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్ ఉన్న వాడిని- జగన్‌కు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్ ఉన్న వాడిని- జగన్‌కు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - రెపో రేట్‌ కట్‌ చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ - తగ్గనున్న వడ్డీ రేట్లు, EMIలు
బ్రేకింగ్‌ న్యూస్‌ - రెపో రేట్‌ కట్‌ చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ - తగ్గనున్న వడ్డీ రేట్లు, EMIలు
Ramgopal Varma: ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
Thandel Movie Review - తండేల్ రివ్యూ: సముద్రంలో చిక్కిన ప్రేమ... తీరానికి ఎలా చేరింది? నాగచైతన్య సినిమా హిట్టా? ఫట్టా?
తండేల్ రివ్యూ: సముద్రంలో చిక్కిన ప్రేమ... తీరానికి ఎలా చేరింది? నాగచైతన్య సినిమా హిట్టా? ఫట్టా?
RBI Repo Rate Cut: రెపో రేట్‌ కటింగ్‌ తర్వాత రూ.25 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి హోమ్‌ లోన్‌పై EMI ఎంత తగ్గుతుంది?
రెపో రేట్‌ కటింగ్‌ తర్వాత రూ.25 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి హోమ్‌ లోన్‌పై EMI ఎంత తగ్గుతుంది?
Teenmar Mallanna Latest News: తీన్మార్‌ మలన్న సమరానికి సిద్ధమవుతున్నారా! రేవంత్‌పై తిరుగుబాటు చేస్తారా?
తీన్మార్‌ మలన్న సమరానికి సిద్ధమవుతున్నారా! రేవంత్‌పై తిరుగుబాటు చేస్తారా?
Sonusood: 'సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం' - అరెస్ట్ వారెంట్‌ వార్తలపై సోనూసూద్ తీవ్ర అసహనం
'సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం' - అరెస్ట్ వారెంట్‌ వార్తలపై సోనూసూద్ తీవ్ర అసహనం
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు హ్యాపీ న్యూస్‌- నాలుగు నెలల్లో మూడు కీలక పథకాల అమలకు కార్యాచరణ సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు హ్యాపీ న్యూస్‌- నాలుగు నెలల్లో మూడు కీలక పథకాల అమలకు కార్యాచరణ సిద్ధం
Embed widget