APPSC AEE Application: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏఈఈ పోస్టుల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (APPCB)లో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 30న ప్రారంభమైంది. ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
AP Pollution Control Board Jobs: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (APPCB)లో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ (Assistant Environmental Engineer) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గత డిసెంబరు 26న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 30న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
వివరాలు..
* అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 21.
పోస్టుల కేటాయింపు: ఓసీ-10, ఈడబ్ల్యూఎస్-02, బీసీ-06, ఎస్సీ-03.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్/మెకానికల్/కెమికల్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏఎంఐటీ సివిల్ ఎగ్జామినేషన్ (AMIE-India Civil examination) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2 సివిల్/మెకానికల్/కెమికల్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-3 ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & టెక్నాలజీ (కామన్ పేపర్)-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు ఉంటాయి.
కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.
జీత భత్యాలు: నెలకు రూ.57,100 - రూ.1,47,760 ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.01.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.02.2024.
➥ రాతపరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024.
ALSO READ:
🔰 ఏపీ మెడికల్ కాలేజీల్లో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
🔰 ఏపీ మెడికల్ కాలేజీల్లో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ - సూపర్ స్పెషాలిటీస్ పోస్టులు, వాక్‌ఇన్ ఎప్పుడంటే?