NIT Warangal Jobs: 50ఏళ్ల వయసున్న వాళ్లు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.. మీరు ట్రై చేశారా?
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 129 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుండగా.. గడువు సెప్టెంబర్ 23 వరకు ఉంది.
![NIT Warangal Jobs: 50ఏళ్ల వయసున్న వాళ్లు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.. మీరు ట్రై చేశారా? NIT Warangal invites applications to fill non-teaching vacancies NIT Warangal Jobs: 50ఏళ్ల వయసున్న వాళ్లు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.. మీరు ట్రై చేశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/29/c60463e328e7bb6a8c49ec9c626c218a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 129 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.
పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుండగా.. గడువు సెప్టెంబర్ 23 వరకు ఉంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://nitw.ac.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
టెక్నీషియన్- 34, టెక్నికల్ అసిస్టెంట్- 27, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను 19 చొప్పున భర్తీ చేయనున్నారు. సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్ విభాగాల్లో 8 చొప్పున పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్ట్రార్- 6, ఎస్‌ఏఎస్ (SAS) అసిస్టెంట్- 3, సీనియర్ మెడికల్ ఆఫీసర్- 1, అసిస్టెంట్ ఇంజనీర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులను 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత, వయోపరిమితి..
పోస్టును బట్టి విద్యార్హత, గరిష్ట వయోపరిమితి మారుతున్నాయి. ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, బీఈ లేదా బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం కూడా తప్పనిసరి. పోస్టులను బట్టి కనీసం 27 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రర్ పోస్టులకు రూ.1000, ఇతర పోస్టులకు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)