NIT: హమిర్‌పూర్ నిట్‌లో 84 నాన్‌టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
హమిర్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వివిధ నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనున్నారు.

హమిర్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వివిధ నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సీనియర్ సెకండరీ(10+2), ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 16న ప్రారంభమైంది. జులై 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 84
పోస్టుల వారీగా ఖాళీలు..
➥ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: 02
➥ సైంటిఫిక్ ఆఫీసర్/టెక్నికల్ ఆఫీసర్: 02
➥ సూపరింటెండెంట్: 05
➥ పర్సనల్ అసిస్టెంట్: 01
➥ జూనియర్ అసిస్టెంట్:12
➥ సీనియర్ అసిస్టెంట్: 04
➥ టెక్నికల్ అసిస్టెంట్: 18
➥ జూనియర్ ఇంజినీర్: 02
➥ స్టూడెంట్స్ ఆక్టివిటీ & స్పోర్ట్స్ (సాస్) అసిస్టెంట్: 02
➥ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 02
➥ టెక్నీషియన్: 02
➥ సీనియర్ టెక్నీషియన్: 11
➥ ఫార్మసిస్ట్: 01
అర్హత: పోస్టును అనుసరించి సీనియర్ సెకండరీ(10+2), ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: పోస్టుని అనుసరించి 27-50 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్/ ట్రేడ్ టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.21700-రూ.209200 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.06.2023.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 10.07.2023.
Also Read:
ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్, వివరాలు ఇలా!
ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కనీసం 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్)-2023 పరీక్షలో ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. జేఈఈ (మెయిన్)-2023 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

