అన్వేషించండి

NIACL: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 300 అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా

NIACL: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్( NIACL) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 300 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

NIACL Assistant Posts Recruitment: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్( NIACL) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 300 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న వారు  ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఉద్యోగాల ఎంపిక చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.37,000 జీతంగా చెల్లిస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 300

* అసిస్టెంట్ పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు తప్పనిసరిగా ప్రాంతీయ భాషపై పట్టు ఉండాలి.

వయోపరిమితి: 01.01.2024 నాటికి 21 - 30 సంవత్సరాలు మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఆర్మీ ఫోర్స్ సర్వీస్ కాలంతో పాటు 3 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

వేతనం: నెలకు రూ.37,000.

ఎంపిక విధానం: ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలో సాధించిన అర్హత మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

పరీక్ష విధానం: ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి, ప్రిలిమ్స్‌లో కనీసం కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌కు పిలుస్తారు.

➥ ప్రిలిమ్స్ పరీక్ష: పరీక్ష ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది,  అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్షను 3 విభాగాలుగా నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల మీద ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి: 60 నిమిషాలు(1 గంట). మొత్తం100 ప్రశ్నలకు గాను 100 గరిష్ట మార్కులు. ప్రతి విభాగానికి 20 నిమిషాలు కెటాయించారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది మరియు ప్రశ్న వెయిటేజీలో ¼ తప్పు సమాధానానికి పెనాల్టీ ఉంటుంది.

➥ మెయిన్స్ పరీక్ష: పరీక్ష ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్, టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ మీద ప్రశ్నలు అడుగుతారు. మొత్తం200 ప్రశ్నలకు గాను 250 గరిష్ట మార్కులు. ప్రతి ప్రశ్నకు 1.25 మార్కు ఉంటుంది మరియు ప్రశ్న వెయిటేజీలో ¼ తప్పు సమాధానానికి పెనాల్టీ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2024.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 15.02.2024.

Website

NIACL: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 300 అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా

ALSO READ:

ఎన్‌హెచ్‌ఏఐలో 60 డిప్యూటీ మేనేజర్ పోస్టులు, వివరాలు ఇలా
న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేపుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. యూపీఎస్సీ 2023లో నిర్వహించిన ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Embed widget