DMHO: నెల్లూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు, వివరాలు ఇలా!
నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన పీడియాట్రిషియన్(టెలిమెడిసిన్ హబ్), జనరల్ ఫిజిషియన్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.
నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన పీడియాట్రిషియన్(టెలిమెడిసిన్ హబ్), జనరల్ ఫిజిషియన్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో 75శాతం ఉత్తీర్ణత ఉండాలి. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 20 సా. 5.30 లోపు ఆఫ్‌లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు చిరునామాలో అందజేయాలి.
వివరాలు:
1) పీడియాట్రిషియన్ (టెలిమెడిసిన్ హబ్): 01 పోస్టు
అర్హత: మెడికల్ గ్రాడ్యుయేట్(ఎంబీబీఎస్), పీడియాట్రిక్స్(ఎండీ) లేదా డిప్లొమా(చైల్డ్ హెల్త్). అభ్యర్థులు ఏపీఎంసీ చట్టం ప్రకారం ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలి.
2) జనరల్ ఫిజిషియన్: 01 పోస్టు
అర్హత: మెడికల్ గ్రాడ్యుయేట్(ఎంబీబీఎస్), జనరల్ మెడిసిన్(ఎండీ). అభ్యర్థులు ఏపీఎంసీ చట్టం ప్రకారం ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
జీతం: నెలకు రూ.1,00,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.500. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు రూ.300. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహయింపు ఉంది.
ఎంపిక విధానం: వెయిటేజీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో 75శాతం ఉత్తీర్ణత ఉండాలి. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు చిరునామాలో అందజేయాలి.
::Also Read::
రిజర్వేషన్ల సమస్య కొలిక్కి, ఊపందుకోనున్న నియామకాలు!
తెలంగాణలో రిజర్వేషన్ల సమస్య కొలిక్కి వచ్చింది. దీంతో నియామకాలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా గిరిజన రిజర్వేషన్ల పెంపుతోపాటు, రోస్టర్ పాయింట్ల ఖరారు వంటి చర్యలు పూర్తవడంతో నియామకాల ప్రక్రియ ఊపందుకోనుంది. 'గ్రూప్-1' కీ విడుదల నేపథ్యంలో మెయిన్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన 80 వేల ఖాళీల్లో ఇప్పటికే మెజార్టీ ఉద్యోగాలకు ఆర్ధికశాఖ అనుమతులను జారీ చేసింది. అదేవిధంగా ఓసీలకు 44 ఏళ్లు; బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు వయోపరిమితిని ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగాలకు పోటీ మరింత పెరిగినట్లయింది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఏపీలో 1,458 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, చివరితేది ఎప్పుడంటే? (చివరితేది: 18.11.2022)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లో 1458 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 19 దరఖాస్తుకు చివరితేదీగా నిర్ణయించారు.
పోస్టుల, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..