NRSC Jobs: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో టెక్నీషియన్ పోస్టులు - పది, ఐటీఐ అర్హతతో రూ.69వేల జీతం
NRSC Notification: హైదరాబాద్‌లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టులను భర్తీచేయనున్నారు.
National Remote Sensing Centre Recruitment: హైదరాబాద్‌లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టులను భర్తీచేయనున్నారు. పదోతరగతితోపాటు, సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 31లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. దీంతోపాటు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష సమయంలో ప్రాసెసింగ్ ఫీజు తిరిగి చెల్లిస్తారు. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మొత్తం ఫీజు (రూ.500), ఇతరులకు రూ.400 రీఫండ్ చేస్తారు. రాతపరీక్ష (సీబీటీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
* టెక్నీషియన్-బి పోస్టులు
ఖాళీల సంఖ్య: 54
విభాగాలవారీగా ఖాళీలు..
➥ ఎలక్ట్రానిక్ మెకానిక్: 33
➥ ఎలక్ట్రికల్: 08
➥ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 09
➥ ఫొటోగ్రఫీ: 02
➥ డీటీపీ ఆపరేటర్: 02
విద్యార్హత: పదోతరగతితోపాటు, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.12.2023 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100. అయితే, ప్రాసెసింగ్ ఫీజు కింద మరో రూ.500లు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులకు తర్వాత ఈ మొత్తాన్ని రిఫండ్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష (సీబీటీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: నెలకు రూ.21,700- రూ.69,100 (పే లెవెల్ -3) వరకు చెల్లిస్తారు.
రాతపరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 80 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 90 నిమిషాలు (గంటన్నర) ఉంటుంది. ప్రతిప్రశ్నకు ఒకమార్కుకాగా, ప్రతి తప్పు సమాధానం రాస్తే 0.33 మార్కులు కోత విధిస్తారు. ఇక 100 మార్కులకు స్కిల్‌టెస్ట్ నిర్వహిస్తారు. రాతపరీక్షలో తుది జాబితా ఆధారంగా స్కిల్ టెస్ట్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.12.2023 (5 PM).
ALSO READ:
ఏపీ దేవాదాయ శాఖలో 70 ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు - అర్హతలివే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 40 ఏఈఈ పోస్టులు, 35 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఏపీకి చెందిన హిందూ మతస్తులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 05 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..