By: ABP Desam | Updated at : 13 Mar 2023 09:10 AM (IST)
Edited By: omeprakash
నల్సార్ యూనివర్సిటీ ఉద్యోగ నోటిఫికేషన్
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వివిధ ఫ్యాకల్టీ, ఇతర అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 58 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఐజీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణత, నెట్/ స్లెట్/ సెట్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా మార్చి 31లోగా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 58.
1. ప్రొఫెసర్(లా, మేనేజ్‌మెంట్): 10 పోస్టులు
2. అసోసియేట్ ప్రొఫెసర్(లా, మేనేజ్‌మెంట్): 12 పోస్టులు
3. అసిస్టెంట్ ప్రొఫెసర్(లా, మేనేజ్‌మెంట్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్): 33 పోస్టులు
4. డైరెక్టర్(డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్): 01 పోస్టు
5. హెడ్, కార్పొరేట్ ఇంటర్‌ఫేస్: 01 పోస్టు
6. ప్లేస్‌మెంట్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: పోస్టును అనుసరించి పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఐజీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణత, నెట్/ స్లెట్/ సెట్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2023.
Also Read:
హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్ ఖాళీలు- అర్హతలివే!
వారణాసిలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్ సెంటర్ దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా మొత్తం 10 సీనియర్ రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ, ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 14 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ముంబయి పోర్ట్ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
HSL: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 43 ఖాళీలు, వివరాలు ఇలా!
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్‌ఎస్ఎల్) వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో పర్మనెంట్ నియామకాల కింద మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను; తాత్కాలిక ప్రాతిపదికన డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 6 వరకు పర్మనెంట్ పోస్టులకు, ఏప్రిల్ 16 వరకు ఫిక్స్‌డ్ టర్మ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!
APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
IISER లో 21 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా!
UPSC NDA 1 Admit Card: యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
UPSC CDS Admit Card: సీడీఎస్-1 ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల