By: ABP Desam | Updated at : 11 Mar 2023 02:41 PM (IST)
Edited By: omeprakash
టాటా మెమోరియల్ సెంటర్ నోటిఫికేషన్
వారణాసిలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్ సెంటర్ దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా మొత్తం 10 సీనియర్ రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ, ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 14 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 10
1. సీనియర్ రెసిడెంట్: 07 పోస్టులు
విభాగాలు: అనస్థీషియాలజీ, మెడికల్ అంకాలజీ, అంకో పాథాలజీ, పీడియాట్రిక్ అంకాలజీ, ప్రివెంటివ్ అంకాలజీ, రేడియో డయాగ్నోసిస్, సర్జికల్ అంకాలజీ.
2. మెడికల్ ఆఫీసర్: 03 పోస్టులు
విభాగాలు: మెడికల్ అంకాలజీ, పీడియాట్రిక్ అంకాలజీ.
అర్హత: పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ, ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.03.2023.
Also Read:
ఎస్‌బీఐ పీవో మెయిన్స్-2022 ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన పీవో మెయిన్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ మార్చి 10న ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ప్రిలిమ్స్ ఉత్తీర్ణులకు జనవరి 30న మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఫేజ్-3కి సంబంధించి సైకోమెట్రిక్ టెస్టుకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఎస్‌బీఐ తాజాగా ప్రకటించింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులు గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఎల్‌ఐసీ ఏఏవో ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి, మెయిన్ పరీక్షకు 7,754 మంది అభ్యర్థులు ఎంపిక!
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏఏవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఎల్‌ఐసీ మార్చి 10న విడుదల చేసింది. ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 7,754 మంది అభ్యర్థులు ప్రధాన (మెయిన్) పరీక్షకు ఎంపికయ్యారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 18న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ముంబయి పోర్ట్ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
REC Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!
IITB Jobs: ఐఐటీ బాంబేలో జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్ పోస్టులు
SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!
L&T Recruitment 2023: ఎల్ & టీలో ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు, అర్హతలు ఇవే!
మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?
Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు
Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?
Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?