(Source: ECI/ABP News/ABP Majha)
LIC AAO Prelims Result: ఎల్‌ఐసీ ఏఏవో ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి, మెయిన్ పరీక్షకు 7,754 మంది అభ్యర్థులు ఎంపిక!
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏఏవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఎల్‌ఐసీ మార్చి 10న విడుదల చేసింది.
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏఏవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఎల్‌ఐసీ మార్చి 10న విడుదల చేసింది. ఫలి్తాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 7,754 మంది అభ్యర్థులు ప్రధాన (మెయిన్) పరీక్షకు ఎంపికయ్యారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 18న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఎల్‌ఐసీ ఏఏవో ప్రిలిమ్స్ ఫలితాలు...
మెయిన్స్ పరీక్ష విధానం..
➥ మొత్తం 325 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలో 120 పశ్నలకు-300 మార్కులు, డిస్క్రిప్టివ్ పరీక్ష (ఇంగ్లిష్)కు 25 మార్కులు కేటాయించారు.
➥ఆబ్జెక్టివ్ పరీక్షలో రీజనింగ్ ఎబిలిటి నుంచి 30 ప్రశ్నలు-90 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు-60 మార్కులు, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 30 ప్రశ్నలు-90 మార్కులు, ఇన్స్యూరెన్స్ & ఫైనాన్షియల్ మార్కెట్ అవెర్‌నెస్ నుంచి 30 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
➥ హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. 2 గంటల సమయం కేటాయించారు. ఇక డిస్క్రిప్టివ్ పేపరుకు 30 నిమిషాల సమయం కేటాయించారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 15.01.2023 |
ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం | 31.01.2023 |
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది | 31.01.2023 |
ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్ డౌన్‌లోడ్ | పరీక్ష తేదికి 7-10 రోజుల ముందు |
ప్రిలిమినరీ పరీక్ష తేదీ | 17.02.2023 & 20.02.2023 తేదీల్లో |
మెయిన్ పరీక్ష తేదీ | 18.03.2023. |
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఎస్‌బీఐ పీవో మెయిన్స్-2022 ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన పీవో మెయిన్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ మార్చి 10న ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ప్రిలిమ్స్ ఉత్తీర్ణులకు జనవరి 30న మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఫేజ్-3కి సంబంధించి సైకోమెట్రిక్ టెస్టుకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఎస్‌బీఐ తాజాగా ప్రకటించింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులు గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
పీవో ఫలితాల కోసం క్లిక్ చేయండి..
HSL: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 43 ఖాళీలు, వివరాలు ఇలా!
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్‌ఎస్ఎల్) వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో పర్మనెంట్ నియామకాల కింద మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను; తాత్కాలిక ప్రాతిపదికన డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 6 వరకు పర్మనెంట్ పోస్టులకు, ఏప్రిల్ 16 వరకు ఫిక్స్‌డ్ టర్మ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గెయిల్ గ్యాస్ లిమిలెడ్‌లో 120 అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
నోయిడాకు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గెయిల్ ఆధ్వర్యంలోని గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..