MRPL Jobs: మంగళూరు రిఫైనరీలో 27 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
MRPL Recruitment:మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) ఈ2 గ్రేడులో అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Mangalore Refinery and Petrochemicals Limited Notification: మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) ఈ2 గ్రేడులో అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 పోస్టులని భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. గేట్-2023 మార్కులు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా మూడేళ్ల కాలానికి సర్వీసు బాండు సమర్పించాల్సి ఉంటుంది. మూడేళ్లు తప్పనిసరిగా సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం మానేస్తే జనరల్ అభ్యర్థులు రూ.3 లక్షలు బాండ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈబ్ల్యూఎస్, ఓబీసీ(NCL), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 27
* అసిస్టెంట్ ఇంజినీర్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ కెమికల్: 15
అర్హత: కెమికల్ ఇంజినీరింగ్/ కెమికల్ టెక్నాలజీ/ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్/ పెట్రోకెమికల్ టెక్నాలజీ విభాగాల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 స్కోరు తప్పనిసరి.
➥ మెకానికల్: 08
అర్హత: మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 స్కోరు తప్పనిసరి.
➥ ఎలక్ట్రికల్: 03
అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 స్కోరు తప్పనిసరి.
➥ కంప్యూటర్ సైన్స్: 01
అర్హత: కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ /ఇన్‌ఫర్మేషన్ ఇంజినీరింగ్/ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ మెషిన్ లెర్నింగ్ / డేటా సైన్స్ / సైబర్ సెక్యూరిటీ / ఇంటర్నెట్-ఆఫ్-థింగ్స్ విభాగాల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 స్కోరు తప్పనిసరి.
వయోపరిమితి: 10.02.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.118. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రుసుం చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: గేట్-2023 మార్కులు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
జీత భత్యాలు: నెలకు రూ.50,000- రూ.1,60,000.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ:12/01/2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ:10/02/2024.
ఇదీ చదవండి:
సీబీఆర్‌ఐలో 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే
రూర్కిలోని సీఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమా (సివిల్, అర్కిటెక్చర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ) చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 7 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..