CBRI: సీబీఆర్‌ఐలో 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే
CBRI Recruitment: రూర్కిలోని సీఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
CBRI Recruitment: రూర్కిలోని సీఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమా (సివిల్, అర్కిటెక్చర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ) చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 7 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 24
పోస్టుల కేటాయింపు: యూఆర్- 09, ఎస్సీ– 02, ఎస్టీ– 02, ఓబీసీ(ఎన్‌సీఎల్)– 07, ఈడబ్ల్యూఎస్– 04. ఇందులో 2 పోస్టు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేటాయించారు.
*టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
➥ TA20231: 09
పోస్టుల కేటాయింపు: యూఆర్- 01, ఎస్సీ– 01, ఎస్టీ– 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)– 03, ఈడబ్ల్యూఎస్– 03. ఇందులో 1 పోస్టు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేటాయించారు.
అర్హత: కనీసం 60% మార్కులతో సివిల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో 3 సంవత్సరాల ఫుల్‌టైమ్ డిప్లొమా మరియు సంబంధిత ప్రాంతం/ఫీల్డ్‌లో 02 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ TA20232: 03
పోస్టుల కేటాయింపు: యూఆర్-01, ఎస్సీ-01, ఓబీసీ(ఎన్‌సీఎల్)– 01. ఇందులో 1 పోస్టు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేటాయించారు.
అర్హత: కనీసం 60% మార్కులతో ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్‌లో 3 సంవత్సరాల ఫుల్‌టైమ్ డిప్లొమా మరియు సంబంధిత ప్రాంతం/ఫీల్డ్‌లో 02 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ TA20233: 02
పోస్టుల కేటాయింపు: యూఆర్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)– 01.
అర్హత: కనీసం 60% మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో 3 సంవత్సరాల ఫుల్‌టైమ్ డిప్లొమా మరియు సంబంధిత ప్రాంతం/ఫీల్డ్‌లో 02 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ TA20234: 01
పోస్టుల కేటాయింపు: యూఆర్- 01.
అర్హత:కనీసం 60% మార్కులతో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో 3 సంవత్సరాల ఫుల్‌టైమ్ డిప్లొమా మరియు సంబంధిత ప్రాంతం/ఫీల్డ్‌లో 02 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ TA20235: 03
పోస్టుల కేటాయింపు: యూఆర్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)– 01, ఈడబ్ల్యూఎస్– 01.
అర్హత:కనీసం 60% మార్కులతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3 సంవత్సరాల ఫుల్‌టైమ్ డిప్లొమా మరియు సంబంధిత ప్రాంతం/ఫీల్డ్‌లో 02 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ TA20236: 01
పోస్టుల కేటాయింపు: యూఆర్- 01.
అర్హత: కనీసం 60% మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో 3 సంవత్సరాల ఫుల్‌టైమ్ డిప్లొమా మరియు సంబంధిత ప్రాంతం/ఫీల్డ్‌లో 02 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ TA20237: 02
పోస్టుల కేటాయింపు: ఎస్సీ-01, ఓబీసీ(ఎన్‌సీఎల్)– 01.
అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ఆర్గనైజేషన్ నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ లేదా తత్సమానంతో పాటు సంబంధిత విభాగంలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
➥ TA20238: 01
పోస్టుల కేటాయింపు: యూఆర్- 01.
అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ఆర్గనైజేషన్ నుంచి బీఎస్సీ ఫిజిక్స్ లేదా తత్సమానంతో పాటు సంబంధిత విభాగంలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
➥ TA20239: 01
పోస్టుల కేటాయింపు: యూఆర్- 01.
అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ఆర్గనైజేషన్ నుంచి బీఎస్సీ జియాలజీ లేదా తత్సమానంతో పాటు సంబంధిత విభాగంలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
➥ TA202310: 01
పోస్టుల కేటాయింపు: యూఆర్- 01.
అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ లేదా తత్సమానంతో పాటు బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.
వేతనం: నెలకు రూ.35,400 - రూ.1,12,400.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరితేది: 07.02.2024.
దరఖాస్తు హార్డుకాపీలు పంపాల్సిన చివరితేది: 20.02.2024.