MIDHANI: హైదరాబాద్ మిధానిలో వివిధ ఉద్యోగాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి!
హైదరాబాద్‌లోని మిధాని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి 10వ తరగతి/ ఐటీఐ/ ఇంటర్మీడియట్/ బీఎస్సీ/ జీఎన్‌ఎం ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అర్హులు.
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి 10వ తరగతి/ ఐటీఐ/ ఇంటర్మీడియట్/ బీఎస్సీ/ జీఎన్‌ఎం ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అర్హులు. రాతపరీక్ష, క్వాలిఫికేషన్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్మతలు గల అభ్యర్థులు డిసెంబరు 07వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 15
1. జూనియర్ స్టాఫ్ నర్స్: 04
అర్హత: బి.ఎస్సీ. నర్సింగ్/జీఎన్‌ఎమ్‌తో పాటు ఇంటర్మీడియట్/ ఈఎమ్‌టీ లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత సమానమైన 2సంవత్సరాల ఏమర్జెన్సి మెడిసిన్ లేదా టెక్నీషియన్ కోర్సు, సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 23.11.2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.19,130.
2. ఫైర్‌మ్యాన్: 03
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత, గుర్తింపు పొందిన సంస్థ నుండి ప్రాథమిక మరియు అగ్నిమాపక శిక్షణ కాలం(6 నెలల కంటె తక్కువ కాకుడదు). LMV/HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. (మాజీ సైనికులకు ప్రాధాన్యం)
వయోపరిమితి: 23.11.2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.19,130.
3. రిఫ్రాక్టరీ మేసన్: 01
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత లేదా సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 23.11.2022 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.19,130.
4. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) - NDT ఆపరేటర్: 02
అర్హత: పదవతరగతి, ఐటిఐ(ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణత లేదా సంబంధిత విభాగంలో కనీసం 2సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 23.11.2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.20,000.
5. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) - ఫిట్టర్ - కట్టింగ్ మెషీన్స్: 01
అర్హత: పదవతరగతి, ఐటిఐ(ఫిట్టర్)తో పాటు సంబంధిత విభాగంలో కనీసం 7సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 23.11.2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.20,000.
6. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) -టర్నర్: 01
అర్హత: పదవతరగతి, ఐటిఐ(టర్నర్)లో కనీసం 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవం.
వయోపరిమితి: 23.11.2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.20,000.
7. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (JOT) -ఫిట్టర్: 01
అర్హత: పదవతరగతి, ఐటిఐ(ఫిట్టర్)లో కనీసం 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవం. ఏదైనా మెకానికల్ / మెటలర్జికల్ పరికరాల నిర్వహణ.
వయోపరిమితి: 23.11.2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.20,000.
8. సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (SOT) -సివిల్: 01
అర్హత: 60 శాతం మార్కులతో డిప్లొమా(ఇంజినీరింగ్- సివిల్) ఉత్తీర్ణత. సంబంధిత ప్రాంతంలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 23.11.2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ. 21,900.
9. ల్యాబ్ టెక్నీషియన్: 01
అర్హత: 60 శాతం మార్కులతో బీఎస్సీ(కెమిస్ట్రీ/ఫిజిక్స్) లేదాడిప్లొమా (ఇంజినీరింగ్ (మెటలర్జీ)). కనీసం 3 సంవత్సరాల సంబంధిత పోస్ట్ అర్హత అనుభవం.
వయోపరిమితి: 23.11.2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ. 22,950.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, క్వాలిఫికేషన్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 07.12.2022.
Also Read:
సీటెట్-2022 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
కేంద్రీయ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే 'సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్)-2022' దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 31న ప్రారంభమైన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు నవంబర్ 24తో ముగియనుంది. అయితే ఫీజు చెల్లించడానికి నవంబరు 25 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500), రెండు పేపర్లకు అయితే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. సీటెట్ ఆన్‌లైన్ టెస్టును డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి మధ్య నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి.
SAIL Recruitment: సెయిల్‌లో 245 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, అర్హతలివే!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2022 అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్ధులు నవంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..