News
News
X

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియను అధికారులు పొడిగించారు. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియను అధికారులు పొడిగించారు. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వాస్తవానికి జనవరి 30 వరకే దరఖాస్తుకు అవకాశం ఉంది. అయితే దరఖాస్తు సమయంలో సాంకేతిక కారణాల వల్ల అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో మరో నాలుగురోజులపాటు పొడిగిస్తూ నిర్ణయంతీసుకున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తుల సంఖ్య 8 లక్షలు దాటిన సంగతి తెలిసిందే. దరఖాస్తుకు మరో నాలుగురోజులు గడువు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య దాదాపుగా 10 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. జనవరి 30న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల సంఖ్య 8,47,277కి చేరింది. జనవరి 29న ఒక్కరోజే 58,845 మంది దరఖాస్తు చేసుకోగా.. జనవరి 30న మరో 34,247 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

Online Application 

గ్రూప్-4లో 141 కొత్త పోస్టులు.. 
గ్రూప్-4లో మొత్తం ఉద్యోగాల సంఖ్య 8180కి చేరింది. ఇప్పటివరకు 8039గా ఉన్న ఖాళీల సంఖ్య మహాత్మాజ్యోతిభాపూలే బీసీ సంక్షేమ హాస్టళ్లకు మరో 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జతచేశారు. దీంతో 289గా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య 430కి చేరింది. అదేవిధంగా మొత్తం గ్రూప్-4 ఉద్యోగాల సంఖ్య 8180కి చేరినట్లయింది. 

గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 2న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు 2023, జనవరి 30 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. ప్రాథమికంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే డిసెంబరు 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో మాత్రం 8039 పోస్టులనే భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అంటే 1129 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను తొలిగించింది. పంచాయతీరాజ్ విభాగంలో 1245 పోస్టులకుగాను కొన్నింటికి మాత్రమే ఆ శాఖ నుంచి ప్రతిపాదనలు అందాయి. మిగిలిన ఖాళీల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల పోస్టుల సంఖ్య తగ్గించాల్సి వచ్చింది. దీంతో కేవలం 37 పోస్టులను మాత్రమే నోటిఫై చేసింది. దీంతో పంచాయతీరాజ్ విభాగంలో మొత్తంగా 1208 పోస్టులను తొలగించినట్లయింది. మరికొన్ని విభాగాల్లో 79 పోస్టులను పెంచడంతో తొలగించిన మొత్తం పోస్టుల సంఖ్య 1129కి చేరింది. 

ఇక పంచాయతీరాజ్ విభాగంలో 1208 పోస్టులను తొలగించగా.. మరికొన్ని విభాగాల్లో 79 పోస్టులను పెంచారు. వీటిలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీల సంఖ్య ఒక పోస్టు పెరిగి 742 నుంచి 743 కి చేరింది. ఇక రెవెన్యూ విభాగంలో 19 పెరిగాయి. దీంతో ఆ విభాగంలో ఖాళీల సంఖ్య 2077 నుంచి 2096కి పెరిగింది. ఇక ఉమెన్ అండ్ చైల్డ్ విభాగంలో ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విభాగంలో ఏకంగా 59 కొత్త పోస్టులను చేర్చారు. దీంతో ఈ విభాగంలో 18గా ఉన్న ఖాళీల సంఖ్య ఏకంగా 77 కి చేరింది. అదేవిధంగా తాజాగా బీసీ సంక్షేమ హాస్టళ్లకు మరో 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జతచేయడంతో గ్రూప్-4లో మరిన్ని పోస్టులు వచ్చి చేరాయి. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 8180కి చేరింది.

పోస్టుల వివరాలు... 

మొత్తం ఖాళీల సంఖ్య: 8180 పోస్టులు

1) జూనియర్ అకౌంటెంట్: 429 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు: ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238.

2) జూనియర్ అసిస్టెంట్: 5871 పోస్టులు 

విభాగాలవారీగా ఖాళీలు:

వ్యవసాయశాఖ-44 బీసీ సంక్షేమశాఖ-448 పౌరసరఫరాల శాఖ-72 అటవీశాఖ-23
వైద్యారోగ్యశాఖ-338 ఉన్నత విద్యాశాఖ-743 హోంశాఖ-133 నీటిపారుదల శాఖ-51
మైనార్టీ సంక్షేమశాఖ-191 పురపాలక శాఖ-601 పంచాయతీరాజ్-37 రెవెన్యూశాఖ-2,096
సెకండరీ విద్యాశాఖ-97 రవాణాశాఖ-20 గిరిజన సంక్షేమ శాఖ-221 మహిళా, శిశు సంక్షేమం-77
ఆర్థికశాఖ-46 కార్మికశాఖ-128 ఎస్సీ అభివృద్ధి శాఖ-474 యువజన సర్వీసులు-13

3) జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు

విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్

4) వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు

విభాగం: కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2022. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.01.2023.

➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.

పోస్టుల అర్హతలు, నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రిలిమినరీ పరీక్షలో అందరికీ మార్కులు కలపాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో మార్కులు కలిపిన వాళ్లలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.   
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 31 Jan 2023 06:43 AM (IST) Tags: 15-18 Age Group Vaccination 18 age group 1.8k cases in 4 days TSPSC Group 4 Application Group 4 application Posts Details Group 4 online application Group 4 Application Last Date

సంబంధిత కథనాలు

IBPS SO results: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS SO results: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

TSNPDCL: ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!

TSNPDCL: ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

టాప్ స్టోరీస్

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...