KVs Recruitment: ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
హైదరాబాద్ ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులకు మార్చి 07 నుంచి 10 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
వివరాలు..
1) పీజీటీ
2) టీజీటీ
3) పీఆర్‌టీ
4) కోచ్
5) స్టాఫ్ నర్స్
6) ఎడ్యుకేషనల్ కౌన్సెలర్
7) స్పెషల్ ఎడ్యుకేటర్ & కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్.
విభాగాలు: కెమిస్ట్రీ, మ్యాథ్స్, హిందీ, కామర్స్, సోషనల్ స్డడీస్, ఇంగ్లీష్, సైన్స్, సంస్కృతం, మ్యూజిక్, డ్యాన్స్, హాకీ/అథ్లెటిక్స్, యోగా, టైక్వాండో.
అర్హత: పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించాలి.
వయోపరిమితి: 18-65 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.21250-రూ.27500 చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: Kendriya Vidyalaya.No.1, Uppal, Hyderabad.
ముఖ్యమైన తేదీలు...
➥ ఇంటర్వ్యూ తేది: 07.03.2023 & 10.03.2023.
➥ ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30.
Also Read:
ఎల్‌ఐసీ ఏడీవో ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు వచ్చశాయ్! పరీక్ష ఎప్పుడంటే?
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 9394 అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలో మొత్తం 1408 ఏడీఓ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
పోలీసు అభ్యర్థులకు అలర్ట్, మార్చి 11న 'టెక్నికల్ విభాగం' రాతపరీక్షలు - హాల్‌టికెట్లు ఎప్పుడంటే?
తెలంగాణలో ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్ స్థాయి నియామక ప్రక్రియలో భాగంగా సాంకేతిక విభాగాలకు సంబంధించిన తుది రాతపరీక్షలు మార్చి 11న జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఎస్‌ఐ తుది రాతపరీక్ష మార్చి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఫింగర్ ప్రింట్ బ్యూరో (ఎఫ్‌పీబీ) ఏఎస్‌ఐ తుది రాతపరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్ర 5.30 గంటల వరకు జరగనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
గ్రూప్-2 పరీక్ష తేదీ వెల్లడి..
తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూలును త్వరలోనే ప్రకటించనున్నారు. పరీక్షలకు వారం ముందునుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ ప్రకటించింది. తెలంగాణలో గ్రూప్-2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16తో ముగిసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు మొత్తం 5,51,943 దరఖాస్తులు అందాయి. అందినట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. చివరి రోజు 68వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.