KVS Jobs: సిరిసిల్ల, సిద్దిపేట కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ పోస్టులు, వివరాలు ఇలా!
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్/డీఎడ్/డిప్లొమా/బీటెక్/బీఈ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సిరిసిల్ల, సిద్దిపేటల్లోని కేంద్రీయ విద్యాలయాల్లొ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీనియర్ సెకండరీ సర్టిఫికేట్/ఇంటర్, డీఎడ్/డిప్లొమా/బీటెక్/బీఈ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులకు మార్చి 15, 16వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పోస్టుల వివరాలు..
➥ పీఆర్‌టీ
➥ టీజీటీ
➥ స్పెషల్ ఎడ్యుకేటర్
➥ కౌన్సెలర్ & నర్సు
➥ కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్
➥ స్పోర్ట్స్ కోచ్
➥ మ్యూజిక్ టీచర్
➥ డ్యాన్స్ కోచ్ & స్పోర్ట్స్ కోచ్
విభాగాలు: ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మ్యాథమెటక్స్, సైన్స్, సోషల్ సైన్స్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీనియర్ సెకండరీ సర్టిఫికేట్/ఇంటర్, డీఎడ్/డిప్లొమా/బీటెక్/బీఈ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక:
First Floor, Ellenki Engineering College Campus,
Near Rural Police Station, Siddipet.
ఇంటర్వ్యూ తేది: 15.03.2023, 16.03.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి.
ALSO READ:
హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్ ఖాళీలు- అర్హతలివే!
వారణాసిలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్ సెంటర్ దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా మొత్తం 10 సీనియర్ రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ, ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 14 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
గెయిల్ గ్యాస్ లిమిలెడ్‌లో 120 అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
నోయిడాకు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గెయిల్ ఆధ్వర్యంలోని గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ముంబయి పోర్ట్ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..