News
News
వీడియోలు ఆటలు
X

Job Alert: నెలకు 14 రోజులే పని ... రోజుకు రూ. 59 వేల జీతం... ఏం ఉద్యోగమో తెలుసా..!

14 రోజులకు రూ. 9 లక్షలు సంపాదించే ఉద్యోగానికి ఓ ఫ్యామిలీ ప్రకటన ఇచ్చింది. ఇదేదో ఫేక్ నోటిఫికేషన్ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.

FOLLOW US: 
Share:

రోజుకు రూ. 59 వేలు... 14 రోజులకు అక్షరాలా రూ.9 లక్షలు సంపాదించే ఉద్యోగ ప్రకటన ఇచ్చిందో ఫ్యామిలీ. ఈ జాబ్ నోటిఫికేషన్ చూస్తే ఎగిరి గంతేస్తారు. ఎక్కడ ఎక్కడా అంటూ నోటిఫికేషన్ వెదికేస్తారు. ఈ జాబ్ లో కేవలం 14 రోజుల పనికి రూ. 9 లక్షలు సంపాదించవచ్చు. ఇది చూస్తే ముందు ఇదేదో ఫేక్ నోటిఫికేషన్ అనుకుంటారు కానీ... ఇది అక్షరాల సత్యం. ఈ ఉద్యోగానికి పేపర్ లో యాడ్ కూడా ఇచ్చారు. యునైటెడ్ కింగడమ్ లోని ఎడిన్ బర్గ్ లో ఉద్యోగం చేయాల్సి ఉంది.   

Also Read: నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే రూ.కోటి మీ సొంతం.. ఏంటా పథకం?

రోజుకు రూ.59 వేలు

ఈ ఉద్యోగం కోసం ఇచ్చిన యాడ్ లో వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 22 నుంచి జనవరి 5 వరకూ ఉద్యోగం చేయాల్సి ఉంటుందని అప్లికేషన్లు ఆహ్వానించారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది యూకే లోని ఓ రిచ్ ఫ్యామిలీ. క్రిస్మస్ హాలీడేస్ టైంలో తమ పిల్లల్ని చూసుకునేందుకు ఆయా కావాలని నోటిఫికేషన్ లో కోరారు. ఈ సెలవుల్లో ఐదేళ్ల ట్విన్స్ ను చూసుకునేందుకు ఆయా కావాలని తెలిపారు. పిల్లల్ని చూసుకునేందుకు రోజుకు రూ.59 వేలు చెల్లిస్తామని ప్రకటనలో ఆ ఫ్యామిలీ పేర్కొంది. దీని ప్రకారం మొత్తం 14 రోజులకు రూ.9 లక్షలు చెల్లిస్తారు. 

Also Read: క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత.. బిల్లు పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం! మరి ఆర్థిక లావాదేవీలు చెల్లుతాయా?

కనీసం ఐదేళ్ల అనుభవం

క్రిస్మస్ టైంలో యూకేలో ఆయాలు దొరకడం కష్టం. అందుకుగాను ఇంత వేతనం ఇచ్చేందుకు ఈ ఫ్యామిలీ సిద్ధమైంది. క్రిస్మస్ సమయంలో ఈ 14 రోజులు పిల్లల్ని చూసుకోవాల్సి ఉంటుంది. 14 రోజులు ఆయా ఈ ఫ్యామిలీలో ఉండాలి. తన ఇంటికి వెళ్లకూడదు. ముఖ్యంగా క్రిస్మస్ రోజున తమ ఇంట్లోనే ఉండి, పిల్లల్ని చూసుకోవాలని ప్రకటనతో తెలియజేశారు. ఈ 14 రోజులూ ఆయా పిల్లలకు స్నానం చేయించి, ఆహారం తినిపించాలి. వారితో పాటు ఉంటూ ఆడించి, లాలించి నిద్రపుచ్చాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ కోసం అప్లై చేసుకునే వారికి చైల్డ్ కేర్ లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలని కోరారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారై ఉండాలన్నారు.   

Also Read: అర్జెంట్‌గా పాన్‌ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Nov 2021 06:32 PM (IST) Tags: Job Notification UK job alert 14 days 9 lakhs

సంబంధిత కథనాలు

TSPSC Group1 Exam: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్!

TSPSC Group1 Exam: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు తొలగిన ఆటంకాలు, పరీక్ష వాయిదా పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు తొలగిన ఆటంకాలు, పరీక్ష వాయిదా పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

AIIMS: కళ్యాణి ఎయిమ్స్‌లో 121 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!

AIIMS: కళ్యాణి ఎయిమ్స్‌లో 121 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన