JIPMER Jobs: జిప్‌మర్‌లో 433 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం!
బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభం అవుతుంది.
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జిప్‌మర్) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభం అవుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్ధులు డిసెంబర్ 1లోగా దరఖాస్తుచేసుకోవాలి.
వివరాలు..
* నర్సింగ్ ఆఫీసర్: 433 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-175, ఈడబ్ల్యూఎస్-43, ఓబీసీ-116, ఎస్సీ-66, ఎస్టీ-33. మొత్తం పోస్టుల్లో దివ్యాంగులకు 23 పోస్టుల కేటాయించారు.
అర్హతలు: బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్- సర్టిఫికేట్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ)తో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడభ్ల్యూ అభ్యర్ధులకు రూ.1,500 (ఓబీసీలకు రూ.1,500; ఎస్సీ, ఎస్టీలకు రూ.1,200; దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
జీత భత్యాలు: నెలకు రూ.44,900.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభతేదీ: 07.11.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.12.2022.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 10.12.2022.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 18.12.2022.
Also Read:
ECIL Walkin: ఈసీఐఎల్‌లో 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు! వాక్‌ఇన్ షెడ్యూలు ఇదే!
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 13, 14 తేదీల్లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. అర్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ క్యాంపస్‌లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, దరఖాస్తు చేసుకోండి!
ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 15లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..