HSFC: ఇస్రో హెచ్‌ఎస్‌ఎఫ్‌సీలో103 ఖాళీలు, అర్హతలు ఎంపిక వివరాలు ఇలా
ISRO Recruitment: ఇస్రో-హ్యూమన్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్(హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబర్ 09 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ISRO HSFC Recruitment: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)-హ్యూమన్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్ (హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 103 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పదోతరగతితో పాటు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ, బీఈ/బీటెక్ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్), ఎంబీబీఎస్/ఎండీ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెడికల్ ఆఫీసర్ - SD, మెడికల్ ఆఫీసర్ - SC, సైంటిస్ట్ ఇంజినీర్ - SC, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.750. ఇతర పోస్టులకు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి సరైన అర్హతలున్నవారు అక్టోబర్ 09 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 103
పోస్టులు- విభాగాలు..
* మెడికల్ ఆఫీసర్ - SD: 02
➥ ఏవియేషన్ మెడిసిన్: 01
➥ స్పోర్ట్స్ మెడిసిన్: 01
* మెడికల్ ఆఫీసర్ - SC: 01
➥ మెడికల్ ఆఫీసర్: 01
* సైంటిస్ట్ ఇంజినీర్ - SC: 10
➥ స్ట్రక్చరల్ డిజైన్: 01
➥ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 02
➥ సేఫ్టీ/రెలియబిలిటీ ఇంజినీరింగ్: 01
➥ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్: 03
➥ సేఫ్టీ/ఇండస్ట్రియల్ సేఫ్టీ: 02
➥ థర్మల్ ఇంజినీరింగ్: 01
* టెక్నికల్ అసిస్టెంట్: 28
➥ మెకానికల్: 13
➥ ఎలక్ట్రానిక్స్: 11
➥ ఎలక్ట్రికల్: 02
➥ ఫోటోగ్రఫీ/సినిమాటోగ్రఫీ: 02
* సైంటిఫిక్ అసిస్టెంట్: 01
➥ మైక్రోబయాలజీ: 01
* టెక్నీషియన్-బి: 43
➥ ఫిట్టర్: 22
➥ ఎలక్ట్రానిక్ మెకానిక్: 12
➥ ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్: 01
➥ వెల్డర్: 02
➥ మెషినిస్ట్: 01
➥ ఎలక్ట్రికల్: 03
➥ టర్నర్: 01
➥ గ్రైండర్: 01
* డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి: 13
➥ డ్రాఫ్ట్స్‌మ్యాన్-మెకానికల్: 09
➥ డ్రాఫ్ట్స్‌మ్యాన్-సివిల్: 04
* అసిస్టెంట్(రాజభాష): 05
అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ, బీఈ/బీటెక్ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్), ఎంబీబీఎస్/ఎండీ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అసిస్టెంట్(రాజభాష) పోస్టులకు 18-28 సంవత్సరాలు; సైంటిస్ట్ ఇంజినీర్ - SC పోస్టులకు 18-30 సంవత్సరాలు; మిగతా పోస్టులకు 18-35 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: మెడికల్ ఆఫీసర్ - SD, మెడికల్ ఆఫీసర్ - SC, సైంటిస్ట్ ఇంజినీర్ - SC, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.750. ఇతర పోస్టులకు రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.10.2024.
ALSO READ: రైల్వేశాఖలో 8113 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు
రైల్వేశాఖలో ఎన్టీపీసీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దీనిద్వారా 8113 ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండు దశల రాతపరీక్షలు, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకీ సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబరు 16 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..