అన్వేషించండి

IPPB Admitcard: ఐపీపీబీ అసిస్టెంట్ మేనేజర్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

IPPB Admitcard: ఐపీపీబీ స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదల. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 14న రాతపరీక్ష నిర్వహించనున్నారు. 

IPPB Admitcard 2025: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబరు, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 14న రాతపరీక్ష నిర్వహించనున్నారు. 

అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.


పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, రీజనింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, మ్యాథమెటిక్స్ 40 ప్రశ్నలు-40 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.

అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ఇలా..

➥ అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-ibbponline.com.

➥ అక్కడ 'కెరీర్స్' విభాగానికి నావిగేట్ చేసి, 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్‌ఫార్మ్ కోసం స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ .. కింద 'డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్' అనే లింక్‌పై క్లిక్ చేయండి.

➥ అభ్యర్థులు 'రిజిస్ట్రేషన్ నంబర్ / రోల్ నంబర్' అండ్ 'పాస్‌వర్డ్' ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

➥ లాగిన్ అయిన తర్వాత, మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. ఇక్కడ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

పరీక్షా కేంద్రానికి తీసుకురావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్..

➥ పాన్ కార్డ్

➥ పాస్‌పోర్ట్

➥ పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్

➥ ఓటరు కార్డు

➥ బ్యాంక్ పాస్‌బుక్

➥ అభ్యర్థులు ఫోటోతో కూడిన ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాలి. పరీక్షా కేంద్రంలో వెరిఫికేషన్ కోసం ఒరిజినల్‌ డాక్యుమెంట్‌లు తీసుకెళ్లడం తప్పనిసరి.

న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ మేనేజర్ ఐటీ- 54 పోస్టులు, మేనేజర్ ఐటీ- (పేమెంట్‌ సిస్టమ్స్‌)- 01 పోస్టు, మేనేజర్ ఐటీ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్క్ & క్లౌడ్)- 02 పోస్టులు, మేనేజర్ ఐటీ(ఎంటర్‌ప్రైజ్ డేటా వేర్‌హౌస్)- 01 పోస్టు, సీనియర్ మేనేజర్ ఐటీ (పేమెంట్‌ సిస్టమ్స్‌)- 01 పోస్టు, సీనియర్ మేనేజర్ ఐటీ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్క్ & క్లౌడ్)- 01 పోస్టు, సీనియర్ మేనేజర్- ఐటీ (వెండర్, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, ప్రొక్యూర్‌మెంట్, ఎస్‌ఎల్‌ఏ, పేమెంట్స్‌)- 01 పోస్టు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) కాంట్రాక్టు- 07 పోస్టులు కేటాయించారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు రూ.750; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 చెల్లించాలి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Hair Mask To Boost Hair Growth : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Embed widget