IOCL: ఐవోసీఎల్‌లో 465 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా!
ఐవోసీఎల్ వివిధ టెక్నికల్/నాన్-టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్), పైప్‌లైన్ డివిజన్ పరిధిలోని ఐదు రీజియన్లలో వివిధ టెక్నికల్/నాన్-టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 30లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
పైప్‌లైన్ రీజియన్లు:
⦁ వెస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్(WRPL)
⦁ నార్తర్న్ రీజియన్ పైప్‌లైన్స్(NRPL)
⦁ ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్(ERPL)
⦁ సదరన్ రీజియన్ పైప్‌లైన్స్(SRPL)
⦁ సౌత్ ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్(SERPL)
అప్రెంటిస్ ఖాళీలు: 465(యూఆర్- 233, ఎస్సీ- 63, ఎస్టీ- 34, ఓబీసీ- 96, ఈడబ్ల్యూఎస్- 39).
ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్ &ఇనుస్ట్రుమెంటేషన్, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్/ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్.
అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 10.11.2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 10-11-2022
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30.11.2022.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలు: 08.12.2022 నుంచి 18.12.2022 వరకు.
రాత పరీక్ష తేదీ: 18.12.2022.
Also Read:
BANK Jobs: రెప్కో బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అర్హతలివే!
చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'రెప్కో' బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు స్థానిక భాషపై అవగాహన ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 5న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 25 వరకు కొనసాగనుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యమిత్ర పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లాలో.. ఒప్పంద ప్రాతిపదికన ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మా-డీ, బీఎస్సీ ఎంఎల్‌టీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. అక్టోబర్ 30, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...