IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 ACIO పోస్టులు, ఎంపికైతే రూ.1.42 లక్షల వరకు జీతం
న్యూఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Intelligence Bureau Jobs Notification 2023: న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ, హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంఎస్సీ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు (Educational Qualification for IB Jobs). ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 23న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గేట్ స్కోరు (Gate Score), ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్/ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
* అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/టెక్నికల్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 226 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 93, ఈడబ్ల్యూఎస్- 24, ఓబీసీ- 71, ఎస్సీ- 29, ఎస్టీ-09.
విభాగాల వారీ ఖాళీలు..
⏩ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 79 పోస్టులు
⏩ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: 147 పోస్టులు
అర్హతలు: బీఈ, బీటెక్ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి-కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఐటీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్). లేదా ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్- ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్) లేదా పీజీ (కంప్యూటర్ అప్లికేషన్స్). గేట్ 2021/ 2022/ 2023 ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి (Age Limit For IB Jobs): 12.01.2024 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు ( Application Fees ): జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: గేట్ స్కోరు, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్/ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు రూ.44,900 - రూ.1,42,400 వరకు చెల్లింపు
ఐబీ జాబ్ నోటిఫికేషన్ లో ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.12.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.01.2024. (వచ్చే జనవరి 12వ తేదీ)
➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: 16.01.2024. (వచ్చే జనవరి 16వ తేదీ)
ALSO READ:
ఏపీలో 38 డీఈవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ, జీతమెంతో తెలుసా?
ఏపీలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ డిగ్రీతోపాటు, బీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 9 నుంచి 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.





















