అన్వేషించండి

IDBI Admitcard: ఐడీబీఐ ఉద్యోగాల రాతపరీక్ష అడ్మిట్‌‌కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

IDBI Bank Exam Hall Tickets: ఐడీబీఐ బ్యాంకులో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

IDBI Bank Exam Admitcard: ఐడీబీఐ (ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంకులో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు డిసెంబర్‌ 30న, జేఏఎం పోస్టులకు డిసెంబర్‌ 31న పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబరు 31 వరకు అడ్మిట్‌కార్డులు అందుబాటులో ఉండనున్నాయి.

ఐడీబీఐ జేఏఎం/ఎగ్జిక్యూటివ్ పరీక్ష అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్ చేయండి..

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI Bank) ఒప్పంద ప్రాతిపదికన 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ (JAM, Executive) పోస్టుల భర్తీకి నవంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 800 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం) పోస్టులు, 1300 ఎగ్జిక్యూటివ్‌(సేల్స్ అండ్ ఆపరేషన్స్) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 22 నుంచి డిసెంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకు ఎంపికైనవారికి ఏడాదికి రూ.6.14 - రూ.6.50 లక్షలు; ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఎంపికైనవారికి నెలకు రూ.29,000 - రూ.31,000 వరకు జీతం ఉంటుంది. 

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్ - 60 ప్రశ్నలు- 60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వే్జ్- 40 ప్రశ్నలు- 40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 40 ప్రశ్నలు- 40 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్/కంప్యూటర్ /ఐటీ - 60 ప్రశ్నలు- 60 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు (రెండు గంటలు). పరీక్షలో ఇంగ్లిష్ విభాగం మినహా.. మిగతా అన్ని విభాగాలకు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 

ఇంటర్వ్యూ విధానం: మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఇందులో కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

పోస్టుల వివరాలు..

➥ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ ‘ఒ’: 800 

పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 120, ఎస్టీ- 60, ఓబీసీ- 216, ఈడబ్ల్యూఎస్‌- 80, యూఆర్‌- 324.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ అర్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 

➥ ఎగ్జిక్యూటివ్‌- సేల్స్ అండ్ ఆపరేషన్స్(ఈఎస్‌వో): 1300 

పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 200, ఎస్టీ- 86, ఓబీసీ- 326, ఈడబ్ల్యూఎస్‌- 130, యూఆర్‌- 558.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. కేవలం డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించడం అర్హత ప్రమాణాలకు అర్హతగా పరిగణించబడదు.

వయోపరిమితి: 01.11.2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల ప్రభావితులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.

పోస్టుల పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget