ISRO: ఇస్రోలో 65 సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/యూనిట్‌లలో 65 సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/యూనిట్‌లలో 65 సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఆర్క్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తులకు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 4న ప్రారంభంకాగా.. మే 24 వరకు కొనసాగనుంది.
వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 65.
➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ' (సివిల్): 39 పోస్టులు
➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ ' (ఎలక్ట్రికల్): 14 పోస్టులు
➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ' (రిఫ్రిజెరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్): 09 పోస్టులు
➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ' (ఆర్కిటెక్చర్): 01 పోస్టు
➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ' (సివిల్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్: 01 పోస్టు
➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ' (ఆర్కిటెక్చర్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్: 01 పోస్టు
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్.
అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఆర్క్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 24.05.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.250.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
రాతపరీక్ష విధానం..
* మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 95 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో రెండు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. వీటిలో పార్ట్-ఎలో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 0.3 చొప్పున మార్కులు కోత విధిస్తారు.
* ఇక పార్ట్-బిలో 20 మార్కులకు ఆప్టిట్యూడ్/ఎబిలిటి టెస్ట్ ఉంటుంది. వీటిలో న్యూమరికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డయాగ్రమెటిక్ రీజనింగ్, అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.05.2023.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 24.05.2023.
* ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 26.05.2023.
Also Read:
ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్‌లో 212 సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- అర్హతలివే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..