By: ABP Desam | Updated at : 21 Aug 2021 01:08 PM (IST)
ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సు
ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు గోల్డెన్ చాన్స్. ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు (టీజీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2022 జనవరిలో ప్రారంభమయ్యే 134వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు సెప్టెంబర్ 15తో ముగియనుంది.
ఇంజనీరింగ్ పూర్తి చేసిన అవివాహిత పురుషులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపింది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
49 వారాల శిక్షణ..
టీజీసీ ద్వారా ఎంపికైన వారికి 49 వారాల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణ పూర్తయ్యాక వీరిని లెఫ్ట్‌నెంట్ ర్యాంక్ హోదా కలిగిన ఉద్యోగాల్లో నియమిస్తారు. ఇందులో లెవల్ 10 పేస్కేల్ ఆధారంగా అంటే నెలకు రూ. 56,100 నుంచి రూ.1,77,500 వరకు వేతనం చెల్లిస్తారు. వీటికి అదనంగా అలవెన్సులు ఉంటాయి.
Also Read: BECIL Recruitment 2021: బీఈసీఐఎల్‌లో 162 ఉద్యోగాలు.. రూ.1.23 లక్షల వరకు జీతం..
విద్యార్హత, వయోపరిమితి..
విద్యార్హత విషయానికి వస్తే సంబంధిత విభాగంలో (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ తదితర విభాగాలు) ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఫైనలియర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1995 జనవరి 2 నుంచి 2002 జనవరి 1 మధ్య జన్మించిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఖాళీల వివరాలు..
సివిల్/ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ - 10, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ -8, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్, మెకానికల్ విభాగాల్లో 2 చొప్పున కేటాయించారు.
ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్, ఇండస్ట్రియల్/ మ్యానుఫాక్చరింగ్/ ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్‌మెంట్, మైక్రో ఎలక్ట్రానిక్స్ & మైక్రోవేవ్ , ఏరోనాటికల్, ఎరోస్పేస్, ఏవియానిక్స్, ఫైబర్ ఆప్టిక్స్, ప్రొడక్షన్, వర్క్‌షాప్ టెక్నాలజీ విభాగాల్లో ఒకటి చొప్పున ఖాళీలు ఉన్నాయి.
ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?
NIRT: చెన్నై ఎన్ఐఆర్టీలో 24 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
TSLPRB Result: పోలీసు అభ్యర్థుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు వెల్లడి!
EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - బీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు
Naga Shaurya: హీరో నాగశౌర్య సీరియస్, అలిగి వెళ్లిపోయిన అనంత్ శ్రీరామ్ - ఇంటర్వ్యూ వీడియో వైరల్