అన్వేషించండి

IAF Result: అగ్నివీర్ వాయు పరీక్ష ఫలితాలు రాతపరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

IAF Agniveer Vayu Result: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు (01/ 2025)  నియామకాలకు సంబంధించి రాతపరీక్ష (ఫేజ్‌-1) ఫలితాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఏప్రిల్ 12న విడుదల చేసింది.

IAF Agniveer Vayu Exam Results: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు (01/ 2025)  నియామకాలకు సంబంధించి రాతపరీక్ష (ఫేజ్‌-1) ఫలితాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఏప్రిల్ 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ Username లేదా Email ID, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో ఫేజ్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 3500 ఖాళీలను భర్తీచేయనున్నారు.

Agniveervayu Intake 01/2025 Results

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామాకాలకు సంబంధించి అగ్నివీర్ వాయు ఇంటెక్ (01/2025) ఖాళీల భర్తీకి జనవరి మొదటివారంలో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి జనవరి 17 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మార్చి 17న రాతపరీక్ష నిర్వహించారు.

వివరాలు...

* ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు ఇంటెక్ (01/2025)

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ ఇంటర్మీడియట్‌(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు)/ ఇంటర్‌ ఒకేషనల్‌. లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 02.01.2004 నుంచి 02.07.2007 మధ్య జన్మించి ఉండాలి. ఒకవేళ, ఒక అభ్యర్థి ఎంపిక ప్రక్రియ యొక్క అన్ని దశలను క్లియర్ చేసినట్లయితే, నమోదు చేసుకున్న తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు ఉండాలి.

ఫిజికల్ స్టాండర్డ్స్:

⏩ ఎత్తు: పురుష అభ్యర్థులకు ఎత్తు 152.5 సెం.మీ; మహిళా అభ్యర్థులకు నార్త్ ఈస్ట్ లేదా ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు 152 సెం.మీ, తక్కువ కనిష్ట ఎత్తు 147 సెం.మీ. లక్షద్వీప్ అభ్యర్థుల విషయంలో కనీస ఎత్తు 150 సెం.మీ.

⏩ బరువు: ఎత్తు మరియు వయస్సుకు అనులోమానుపాతంలో ఉంటుంది.
చెస్ట్: పురుష అభ్యర్థులకు కనిష్ట ఛాతీ: 77 సెం.మీ ఛాతీ విస్తరణ కనీసం 05 సెం.మీ ఉండాలి, మహిళా అభ్యర్థుల ఛాతీ అనులోమానుపాతంలో ఉండాలి మరియు ఛాతీ విస్తరణ కనిష్టంగా 05 సెం.మీ ఉండాలి.

⏩ వినికిడి: సాధారణ వినికిడిని కలిగి ఉండాలి. అంటే ప్రతి చెవి ద్వారా 06 మీటర్ల దూరం నుండి మాటలు వినగలగాలి.

⏩ డెంటల్: ఆరోగ్యకరమైన చిగుళ్ళు, మంచి దంతాలు మరియు కనీసం 14 డెంటల్ పాయింట్లు ఉండాలి

ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 17.01.2024.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: 06.02.2024.

➥ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 17.03.2024.

Notification

Website 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Embed widget