Postal Jobs: 1899 'పోస్టల్' ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
Online Application For Postal Jobs: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో స్పోర్ట్స్ కోటా పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10న ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబరు 9 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
India Post Sports Quota Posts Online Application Started: భారతీయ తపాలా శాఖ (ఇండియా పోస్ట్) దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో స్పోర్ట్స్ కోటా(Sports Quota ) కింద వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా 1899 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో పోస్టల్ అసిస్టెంట్(Postal Assistant )- 598 ఖాళీలు, సార్టింగ్ అసిస్టెంట్(Sorting Assistant)-143 ఖాళీలు, పోస్ట్‌మ్యాన్(Postman)-585 ఖాళీలు, మెయిల్ గార్డ్(Mail Guard )-03 ఖాళీలు, ఎంటీఎస్(Multi Tasking Staff- MTS)-570 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10న ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబరు 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
పోస్టులవారీగా విద్యార్హతలు, వయోపరిమితి, జీతభత్యాలు నిర్ణయించారు. పోస్టును బట్టి పది, పన్నెండో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో అర్హత సాధించి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 10 నుంచి అర్హతలు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* పోస్టాఫీసు ఉద్యోగాలు
ఖాళీల సంఖ్య: 1899
➥ పోస్టల్ అసిస్టెంట్: 598 పోస్టులు
➥ సార్టింగ్ అసిస్టెంట్: 143 పోస్టులు
➥ పోస్ట్‌మ్యాన్: 585 పోస్టులు
➥ మెయిల్ గార్డ్: 03 పోస్టులు
➥ ఎంటీఎస్: 570 పోస్టులు
క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, అత్యా పత్య, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్స్, చెస్, క్రికెట్, సైక్లింగ్, సైకిల్ పోలో, డెఫ్ స్పోర్ట్స్, ఈక్వెస్ట్రియాన్ స్పోర్ట్స్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, గోల్ప్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, ఐస్-హాకీ, ఐస్-స్కేటింగ్, ఐస్-స్కింగ్, జూడో, కబడ్డీ, కరాటే, కయాకింగ్ అండ్ కనోయింగ్, ఖోఖో, కూడో, మల్లాఖాంబ్, మోటార్ స్పోర్ట్స్, నెట్ బాల్, పారా స్పోర్ట్స్ (పారా ఒలింపిక్, పారా ఏసియన్), పెన్‌కాక్ సిలత్, పోలో, పవర్‌లిఫ్టింగ్, షూటింగ్, షూటింగ్ బాల్, రోల్ బాల్, రోలర్ స్కేటింగ్, రోయింగ్, రగ్బీ, సెపక్ తక్రా, సాఫ్ట్‌బాల్, సాఫ్ట్ టెన్నిస్, స్క్వాష్, స్మిమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, టెన్నికాయిట్, టెన్నిస్, టెన్నిస్‌బాల్ క్రికెట్, టెన్‌పిన్ బౌలింగ్, ట్రైత్లాన్, టగ్ ఆఫ్ వార్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, ఉషూ, రెజ్లింగ్, యాచ్‌టింగ్, యోగాసనా.
1) పోస్టల్ అసిస్టెంట్: 598 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 09.12.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
2) సార్టింగ్ అసిస్టెంట్: 143 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 09.12.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
3) పోస్ట్‌మ్యాన్: 585 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. పదోతరగతిలో స్థానిక భాషలో ఉత్తీర్ణత ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ (లైట్/హెవీ వెహికిల్) కలిగి ఉండాలి. దివ్యాంగులకు డ్రైవింగ్ లైసెన్స్ నుంచి మినహాయింపు ఉంది.
వయసు: 09.12.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
4) మెయిల్ గార్డ్: 03 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. పదోతరగతిలో స్థానిక భాషలో ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 09.12.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
5) మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 570 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 09.12.2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్/యూపీఐ పేమెంట్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అర్హతలు, రిజర్వేషన్ల ఆధారంగా.
జీతభత్యాలు..
➦ పోస్టల్ అసిస్టెంట్ పోస్టులకు (పే లెవల్-4) రూ.25,500 - రూ.81,100 వరకు చెల్లిస్తారు.
➦ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు (పే లెవల్-4) రూ.25,500 - రూ.81,100 వరకు చెల్లిస్తారు.
➦ పోస్ట్‌మ్యాన్ పోస్టులకు (పే లెవల్-3) రూ.21,700 - రూ.69,100 వరకు చెల్లిస్తారు.
➦ మెయిల్ గార్డు పోస్టులకు (పే లెవల్-3) రూ.21,700 - రూ.69,100 వరకు చెల్లిస్తారు.
➦ మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు (పే లెవల్-3) రూ.18,000 - రూ.56,900 వరకు చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.11.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.12.2023.
➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 09.12.2023.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 10.12.2023 - 14.12.2023.