Income Tax Jobs: టెన్త్ అర్హతతో రాత పరీక్ష లేకుండానే ఇన్‌కంటాక్స్ ఉద్యోగాలు
I-T Department Recruitment 2021: ఇన్‌కంటాక్స్ శాఖలో స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న 155 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది.
ఆదాయ పన్ను (Income Tax - ఐటీ) శాఖలో స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దీని ద్వారా ఇన్‌కంటాక్స్ ఇన్‌స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగాల్లో 155 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు స్వీకరణ గడువు ఆగస్టు 25వ తేదీ వరకు ఉంది. పోస్టును బట్టి విద్యార్హతలు మారతాయి. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మరిన్ని వివరాలకు http://incometaxmumbai.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఈ క్రీడలు తప్పనిసరి..
క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, స్వాష్, బిలియర్డ్స్, చెస్, క్యారమ్, బ్రిడ్జ్, బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, జిమ్నాస్టిక్స్, బాడీ బిల్డింగ్ వంటి క్రీడల్లో పాల్గొని ఉండాలి. ఈ క్రీడల్లో రాష్ట్ర / దేశ స్థాయిలో జాతీయ లేదా అంతర్జాతీయ ప్రదర్శన ఉండాలి. అలాగే ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ నిర్వహించే ఇంటర్ యూనివర్సటీ టోర్నమెంట్లలో కూడా పాల్గొని ఉండాలి.
పోస్టుల వివరాలు..
1. ఇన్‌కంటాక్స్ ఇన్‌స్పెక్టర్
ఈ విభాగంలో మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. 2021 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తుకు అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వేతనం ( పే లెవల్ 7) నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది (7వ సీపీసీ ప్రకారం).
2. ట్యాక్స్ అసిస్టెంట్
ఇందులో మొత్తం 83 ఖాళీలు ఉన్నాయి. 2021 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తుకు అర్హులు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అలాగే డేటా ఎంట్రీ స్పీడ్ గంటకు 8 వేల కీ డిప్రెషన్స్‌కి తగ్గకుండా ఉండాలి. వేతనం నెలకు (పే లెవల్ 4) రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది.
3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)
ఈ విభాగంలో మొత్తం 64 ఖాళీలు ఉన్నాయి. 2021 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తుకు అర్హులు. పదో తరగతి / తత్సమాన ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వేతనం నెలకు (పే లెవల్ 1) రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా?
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో http://incometaxmumbai.gov.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. తర్వాత అవసరమైతే వారికి గ్రౌండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. టాక్స్ అసిస్టెంట్ అభ్యర్థులకు టైపింగ్ (స్కిల్ టెస్ట్) పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.