అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

IIMR: ఐఐఎంలో 31 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అర్హతలివే!

రాయ్‌పూర్‌‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఒప్పంద ప్రాతిపదికన పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు.

రాయ్‌పూర్‌‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఒప్పంద ప్రాతిపదికన పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 5వరకు దరఖాస్తుచేసుకోవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 31

పోస్టుల వారీగా ఖాళీలు..

1. హెడ్, క్యాంపస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్(సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

పనిఅనుభవం: కనీసం 15 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 55 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

పే స్కేల్: రూ. 67,700.

2. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01 పోస్టు

అర్హత: యూజీసీ ఆమోదించబడిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

పనిఅనుభవం: కనీసం 12 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 55 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

పే స్కేల్: రూ. 67,700.

3. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 11 పోస్టులు

అర్హత: యూజీసీ ఆమోదించబడిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

పనిఅనుభవం: కనీసం 08 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

పే స్కేల్: రూ.  56,100.

4. కార్పొరేట్ రిలేషన్స్ ఆఫీసర్: 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

పనిఅనుభవం: కనీసం 15 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

పే స్కేల్: రూ. 56,100.

5. సీనియర్ ఇంజినీర్(సివిల్): 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ లేదా బోర్డ్ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీటెక్/బీఈ(సివిల్ ఇంజనీరింగ్‌)లో ఉత్తీర్ణులై ఉండాలి.

పనిఅనుభవం: కనీసం 08 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 45 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

పే స్కేల్: రూ. 47,600.

6. సీనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ లేదా బోర్డ్ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీటెక్/బీఈ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణులై ఉండాలి.

పనిఅనుభవం: కనీసం 08 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 45 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

పే స్కేల్: రూ. 47,600.

7. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 04 పోస్టులు

అర్హత: యూజీసీ ఆమోదించబడిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

పనిఅనుభవం: కనీసం 05 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 45 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

పే స్కేల్: రూ. 47,600.

8. అసిస్టెంట్ సిస్టమ్స్ మేనేజర్: 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్(సీఎస్/ఐటీ) లేదా కంప్యూటర్‌లో స్పెషలైజేషన్‌తో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత లేదా తత్సమాన గ్రేడ్‌ ఉండాలి. 

పనిఅనుభవం: కనీసం 05 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 40 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

పే స్కేల్: రూ. 47,600.

9. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(మాస్ మీడియా/మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌), మాస్టర్స్ డిగ్రీ(పబ్లిక్ రిలేషన్స్/మాస్ కమ్యూనికేషన్‌) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

పనిఅనుభవం: కనీసం 05 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

పే స్కేల్: రూ. 47,600.

10. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 09 పోస్టులు

అర్హత: యూజీసీ ఆమోదించబడిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

పనిఅనుభవం: కనీసం 03 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 40 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

పే స్కేల్: రూ. 35,400.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.04.2023.

Notification 

Application Form 

Website 

Also Read:

ఆర్మీ 'అగ్నివీర్' దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ ఆర్మీలో 'అగ్నివీరుల' నియామకానికి సంబంధించిన  దరఖాస్తు గడువును ఆర్మీ పొడిగించింది. అగ్నివీరుల దరఖాస్తు గుడువు ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. మార్చి 15తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. మార్చి 20 వరకు పొడిగిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ ఏడాది ఆర్మీ అగ్నిపథ్ స్కీమ్ -2023 కింద దాదాపు 25 వేల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇండియన్ ఆర్మీ ఇందుకోసం పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది.   
అగ్నివీరుల దరఖాస్తు, వివరాల కోసం క్లిక్ చేయండి..

ముంబయి పోర్ట్‌ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

BIMTECH: బిర్లా ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు, ఏడాదికి 15 లక్షల వరకు జీతం!
నోయిడాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (బిమ్‌టెక్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి పీహెచ్‌డీ/ఎఫ్‌పీఎం/ పీజీడీఎం/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి  కంగారు పడి వచ్చేయకండి
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి కంగారు పడి వచ్చేయకండి
Vizag CII Summit:  సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి  కంగారు పడి వచ్చేయకండి
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి కంగారు పడి వచ్చేయకండి
Vizag CII Summit:  సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Akhanda 2 First Song: 'అఖండ 2' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్... పూనకాలు తెప్పించేలా బాలకృష్ణ - తమన్ పాట
'అఖండ 2' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్... పూనకాలు తెప్పించేలా బాలకృష్ణ - తమన్ పాట
Ind vs SA 1st test score: బుమ్రా పేస్‌కు దక్షిణాఫ్రికా విలవిల.. మెరిసిన కుల్దీప్, సిరాజ్.. తక్కువ స్కోరుకు సఫారీలు ఆలౌట్
బుమ్రా పేస్‌కు దక్షిణాఫ్రికా విలవిల.. మెరిసిన కుల్దీప్, సిరాజ్.. తక్కువ స్కోరుకు సఫారీలు ఆలౌట్
Rahul Ravindran: మగవాళ్ళు షర్ట్‌లు విప్పితే తప్పు లేదా? చున్నీ తీసేసిన అమ్మాయికి రాహుల్ రవీంద్రన్ సపోర్ట్‌
మగవాళ్ళు షర్ట్‌లు విప్పితే తప్పు లేదా? చున్నీ తీసేసిన అమ్మాయికి రాహుల్ రవీంద్రన్ సపోర్ట్‌
Embed widget