ICMR: ఐసీఎంఆర్-ఎన్‌ఐఆర్‌టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యుబర్‌క్యులోసిస్' గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యుబర్‌క్యులోసిస్' గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 78
1) టెక్నికల్ ఆఫీసర్ గ్రూప్-బి: 05 పోస్టులు
విభాగాలు: క్లినికల్ ఫార్మకాలజీ-01, సైబర్ సెక్యూరిటీ-02, ఎలక్ట్రికల్ ఇంజినీర్-01, స్టాటిస్టిక్స్-01.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి. పోస్టులవారీగా కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
2) టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్-బి: 60
విభాగాలు: మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, క్లినికల్ ఫార్మకాలజీ, బయో-ఇన్ఫర్మాటిక్స్, బయోమెడికల్ ఇంజినీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, హెల్త్ ఎకనామిక్స్, మెకానిక్, ఎలక్ట్రికల్, హెల్త్ ఎకనామిక్స్, మెకానిక్, నెటవర్క్ అడ్మినిస్ట్రేషన్, ఫార్మసీ, సైకాలజీ, సర్వర్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్, సోషియాలజీ, ఎక్స్-రే, వెటర్నరీ సైన్స్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
3) ల్యాబొరేటరీ అటెండెంట్ గ్రూప్-సి: 13
విభాగాలు: ల్యాబొరేటరీ-12, ప్లంబర్-01.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి/ ఐటీఐ.
పని అనుభవం: కనీసం 0-2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-30 ఏళ్లు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.
జీతభత్యాలు: నెలకు రూ.18000-రూ.112400 చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.500, ఇతర పోస్టులకు రూ.300 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం:
➥ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్ ఇంగ్లిష్-10 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్-10 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్/లాజికల్ రీజనింగ్-20 ప్రశ్నలు, అభ్యర్థి సబ్జెక్టు నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమలు చేస్తారు. సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కులు కోత విధిస్తారు. అంటే ప్రతి 4 తప్పుడు సమాధానాలకు ఒక మార్కు కోత ఉంటుంది.
➥ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టుల భర్తీకి మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్ నాలెడ్జ్-20 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ-20 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్-20 ప్రశ్నలు, అభ్యర్థి సబ్జెక్టు నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమలు చేస్తారు. సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కులు కోత విధిస్తారు. అంటే ప్రతి 4 తప్పుడు సమాధానాలకు ఒక మార్కు కోత ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ప్రకటించాల్సి ఉంది.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: ప్రకటించాల్సి ఉంది.
➥ రాతపరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.
Technical Officer Notification