ICICI Bank PO: ఐసీఐసీఐ బ్యాంకులో పీవో పోస్టులు - కోర్సు, స్టైపెండ్ వివరాలు ఇవే
ICICI Bank Jobs: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో) పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ICICI Bank PO Recruitment: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో) పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలకు మించకూడదు. దరఖాస్తుల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే సెలక్షన్ ప్రాసెస్‌కు అనుమతిస్తారు. వారికి ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తారు. పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ భాగస్వామ్యంతో నిర్వహించనున్న పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ (పీజీడీబీ) సేల్స్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత ప్రొబేషనరీ ఆఫీసర్లుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. శిక్షణ కాలంలో స్టయిఫండ్ కూడా ఇస్తారు.
శిక్షణ కాలంలో కోర్‌బ్యాంకింగ్‌పై పరిజ్ఞానం, నైపుణ్యాలపై శిక్షణ కల్పిస్తారు. ప్రధానంగా బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఛానెల్స్ అండ్ కస్టమర్స్, రిసిప్ట్, పేమెంట్స్ తదితరాలపై శిక్షణ ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులు స్పెషలైజేషన్స్ సబ్జెక్టులుగా.. ట్రేడ్ ఫైనాన్స్, ప్రివిలేజ్ బ్యాంకింగ్, రూరల్ ఇన్‌క్లూజివ్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ అంశాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది.
వివరాలు...
* ప్రొబేషనరీ ఆఫీసర్లు - పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ (పీజీడీబీ) సేల్స్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ కోర్సు
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 27 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆన్‌లైన్ సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, కేస్‌బేస్డ్ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ వీటన్నింటిలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌లిస్ట్‌ను తయారుచేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సు వివరాలు..
ఏడాదిపాటు సాగే పీజీడీబీ కోర్సును నాలుగు టర్మ్‌లుగా విభజించారు. టర్మ్‌ల వారీగా క్లాస్ రూమ్ శిక్షణతోపాటు, ఇంటర్న్‌షిప్, ఉద్యోగ శిక్షణ ఉంటుంది. ఇది పూర్తిగా ఏడాది రెసిడెన్షియల్ ప్రోగ్రాం. ఇంటర్న్‌షిప్ కాలంలో కూడా క్యాంపస్‌లో ఉండాల్సి ఉంటుంది.
★ టర్మ్ -1లో నాలుగు నెలలు బెంగళూరులోని ఐఎంఏలో క్లాస్‌రూం శిక్షణ ఇస్తారు.
★ టర్మ్ -2లో రెండు నెలలు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
★ టర్మ్ -3లో రెండు నెలలు బెంగళూరులోని ఐఎంఏలో క్లాస్‌రూం శిక్షణ ఇస్తారు.
★ టర్మ్ -4లో నాలుగు నెలలపాలు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగ శిక్షణ ఉంటుంది.
కోర్సు ఫీజు: సర్వీస్‌ట్యాక్స్ అన్ని కలుపుకొని రూ.2,55,500 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
స్టైపెండ్: ఏడాది కోర్సులో భాగంగా ఎంపికైన వారికి ఏడాదికి రూ.2.31 లక్షల నుంచి రూ.2.6 లక్షల వరకు స్టైపెండ్ ఇస్తారు. ఇందులో క్లాస్‌రూమ్ ట్రైనింగ్‌లో భాగంగా మొదటి నాలుగు నెలలపాటు (టర్మ్-1) నెలకు రూ.5000, తర్వాతి రెండు నెలలు ఇంటర్న్‌షిప్‌లో (టర్మ్-2) నెలకు రూ.22,000 - రూ.24,000, తర్వాతి 6 నెలల జాబ్ ట్రైనింగ్ (టర్మ్-3)లో నెలకు రూ.28,000 - రూ.32,000 స్టైపెండ్‌గా ఇస్తారు.
జీతం: కోర్సు పూర్తయిన తర్వాత నెలకు రూ.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు జీతం ఉంటుంది.