ICAR-IASRI: ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు
Telugu News: న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 13 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Education News: న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన లర్హతలున్నవారు మే 23 వరకు దరఖాస్తులు సమర్పించాలి. మే 27, 28వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 13
⏩ రిసెర్చ్ అసోసియేట్/ సీనియర్ రిసెర్చ్ ఫెలో: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు 40 సంవత్సరాలు మించకూడదు. సీనియర్ రిసెర్చ్ పోస్టులకు ఫెలో 35 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
వేతనం: రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు పీజీ హోల్డర్లకు నెలకు రూ.49,000; పీహెచ్‌డీ కోసం నెలకు రూ.54,000. సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు మొదటి అండ్ రెండవ సంవత్సరం నెలకు రూ.31,000; మూడవ సంవత్సరం నెలకు రూ.35,000.
⏩ ఐటీ ప్రొఫెషనల్-III: 01 పోస్టు
అర్హత: బీటెక్(సీఎస్‌ఈ/ ఐటీ), సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
వేతనం: నెలకు రూ.50,000. 01 సంవత్సరం పని చేసిన తర్వాత 3% ఇంక్రిమెంట్ ఉంటుంది.
⏩ యంగ్ ప్రొఫెషనల్-II: 02 పోస్టులు
అర్హత: కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజినీరింగ్ / కంప్యూటర్ అప్లికేషన్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్, పీజీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21-45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
వేతనం: నెలకు రూ.42,000.
⏩ యంగ్ ప్రొఫెషనల్-I (ఐటీ): 08 పోస్టులు
అర్హత: కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజినీరింగ్ / కంప్యూటర్ అప్లికేషన్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్‌తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21-45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
వేతనం: నెలకు రూ.30,000.
⏩యంగ్ ప్రొఫెషనల్-I (ఎఫ్ అండ్ ఏ): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కాలేజ్ నుంచి కనీసం 60% మార్కులతో బీకామ్/ బీబీఏ/ బీబీఎస్‌తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21-45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
వేతనం: నెలకు రూ.30,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తులతో పాటు పంపాల్సిన డాక్యుమెంట్లు..
➥ పాస్‌పోర్ట్ సైజు ఫోటో (3 నెలల కంటే పాతది కాదు).
➥ రెజ్యూమ్.
➥ 10వ తరగతి మార్కు షీట్.
➥ 10వ తరగతి పాస్ సర్టిఫికెట్.
➥ 12వ తరగతి మార్కు షీట్.
➥ 12వ తరగతి పాస్ సర్టిఫికెట్.
➥ గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్/ట్రాన్స్‌క్రిప్ట్.
➥ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్.
➥ పోస్ట్-గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్/ట్రాన్స్‌క్రిప్ట్.
➥ పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్.
➥ పీహెచ్‌డీ మార్క్ షీట్.
➥ పీహెచ్‌డీ డిగ్రీ సర్టిఫికెట్.
➥ చెల్లుబాటు అయ్యే నెట్/గేట్ అర్హత కలిగిన స్కోర్‌కార్డ్/సర్టిఫికేట్ (వర్తించే చోట)
➥ రీసెర్చ్ పబ్లికేషన్స్ (వర్తించే చోట).
➥ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ (వర్తించే చోట).
➥ నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నట్లయితే, వర్తించే చోట తప్పనిసరిగా అవసరం).
➥ ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ నాన్-క్రీమీ లేయర్/పీహెచ్ సర్టిఫికెట్(వర్తించే చోట).
➥ ఆధార్ కార్డ్ కాపీ.
➥ ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్లు.
➥ అభ్యర్థులు తమ రెజ్యూమ్‌తో పాటు దరఖాస్తులు పంపించాల్సిన చివరి తేదీ: 23.05.2024.
ఇంటర్య్వూ తేదీలు: మే 27, 28.
వేధిక: ICAR-IASRI, New Delhi.